Advertisement
నడిరోడ్డుపై ఒక వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే..కోవిడ్ భయంతో అటుగా వెళ్తున్న ఎవరూ తనని పట్టించుకోకుండా నిర్దాక్షణ్యంగా దిష్టిబొమ్మల్లా నిలబడితే..అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంటనే కారు ఆపి , తన కర్తవ్యం గుర్తు తెచ్చుకుని గాయాలతో బాధపడుతున్న వ్యక్తికి సాయం చేసిన ఘటన ఇంకా మనుషుల్లో అధికారదాహం కాదు, మానవత్వం మిగిలే ఉంది అనడానికి నిదర్శనంగా నిలిచింది..
గుంటూరు నుండి పిడుగురాళ్ల వెళ్తున్న దారిలో బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తిన ట్రక్కు గుద్దేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. తలకు చేతులకు గాయాలై లేవలేకుండా పడి ఉన్న వ్యక్తిని చూస్తూ కూడా కోవిడ్ భయంతో జనం ఎవరూ దగ్గరకు రాలేదు..ఒకరిద్దరు పోలీస్ స్టేషన్ కి, అంబులెన్స్ కి ఫోన్ చేశారు.. ఈ లోపుగా అటువైపు వస్తున్న తాడికొండ MLA ఉండవల్లి శ్రీదేవి.. యాక్సిడెంట్ అయి రోడ్ పై పడి ఉన్న వ్యక్తిని చూసి వెహికిల్ ఆపారు..
Advertisement
వెంటనే చేతికి గ్లౌజులు వేస్కుని, మాస్క్ పెట్టుకుని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి పల్స్ చెక్ చేసారు..అంతేకాదు వెంటనే పోలీస్ లకు కాల్ చేసి రప్పించి తనని అత్యవసర వైధ్య సహాయం కోసం హాస్పిటల్ కి తరలించారు..MLA శ్రీదేవి…రాజకీయాల్లోకి రాకముందు ఆమె డాక్టర్ శ్రీదేవి ..తన పేరువెనుక ఉన్న ఎంబిబిఎస్ పట్టాను కేవలం షో కోసం కాకుండా అత్యవసర సమయంలో ఉపయోగించి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టారు…
ఇలాంటి పాండమిక్ సిట్యుయేషన్లో కూడా శ్రీదేవి భయపడకుండా తనకు సాయం చేయాలని స్టెప్ తీస్కోవడంతో అక్కడున్నవారందరూ అభినందించడం ప్రారంభించారు..ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుండడంతో నెటిజన్లంతా తాడికొండ MLA శ్రీదేవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ఉండవల్లి శ్రీదేవి బెంగళూరు మెడికల్ వర్సిటి నుండి MBBS పూర్తి చేశారు..తర్వాత ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు.. పాలిటిక్స్ లో దూసుకుపోతున్నా డాక్టర్ గా తన వృత్తిని మర్చిపోలేదు డా. ఉండవల్లి శ్రీదేవి..!
Advertisements
Advertisements