Advertisement
ఎవరైనా.. ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే అందుకు సీక్రెట్స్ ఏమీ ఉండవు. కష్టపడాలి. నిరంతరం శ్రమించాలి. ఓటముల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. మళ్లీ మళ్లీ యత్నించాలి. అవే విజయాలను సాధించి పెడతాయి. అవును.. సరిగ్గా ఈ విషయాలను నమ్మింది కాబట్టే ఆమె తన కలను నెరవేర్చుకుంది. టీ అమ్మే అతని కుమార్తె ఆమె. 2020 జూన్ నెలలో హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ పూర్తి చేసుకుంది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ అయింది.
ఐఏఎఫ్ చీఫ్ బీకేఎస్ భడౌరియా ఇటీవలే ఆంచల్ గంగ్వాల్‌ను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమించారు. ఆ క్షణాల్లో ఆంచల్ ఎంతో గర్వంగా ఫీలైంది. ఆమె అంతటి ఘనతను సాధించడం చూసి ఆమె తండ్రి సురేష్ గంగ్వాల్ ఆనంద భాష్పాలు రాల్చాడు. ఎన్నో ఏళ్ల నుంచి తాను కన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని ఆంచల్ తెలిపింది.
MP: Aanchal Gangwal,a tea seller's daughter,makes it to flying branch of Air Force, being the only candidate from MP to clear the admn test for the yr. Says, 'When I was in class 12 I was inspired with Armed Forces' rescue ops during Uttarakhand flood. So decided to join defence. pic.twitter.com/xVKheOfcZ0
Advertisement
— ANI (@ANI) June 23, 2018
Advertisements
Advertisements
23 ఏళ్ల ఆంచల్ తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతగానో కష్టపడింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆమె కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం కొంత కాలంపాటు అక్కడి పోలీసు విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసింది. 8 నెలల అనంతరం ఆమె ఆ జాబ్ మానేసింది. తరువాత ఏఎఫ్‌సీఏటీ రాసింది. ఆరో ప్రయత్నంలో ఎస్‌ఎస్బీకి అర్హత సాధించింది. తరువాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరేందుకు యత్నించి ప్రస్తుతం తన కలను నెరవేర్చుకుంది. అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె అండగా నిలిచారు. ఆమెకు కావల్సిన సహకారం అందించారు.
అంకిత భావం, పట్టుదల, కృషి, కఠిన శ్రమ.. చేస్తే ఎంతటి అసాధ్యాన్నయినా సుసాధ్యం చేయవచ్చని ఆంచల్ నిరూపించింది. తన కలను కష్టపడి సాధించుకుంది. తమ కలలను నెరవేర్చుకోవాలని చూస్తున్న ఎంతో మంది యువతులకు ఆమె ఆదర్శంగా నిలుస్తోంది. 2013లో కేదార్‌నాథ్‌లో వరదల వల్ల ఎంతో మంది చనిపోయారు. అప్పుడే ఆమె ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని అనుకుని, ఇప్పటికి తన కలను నెరవేర్చుకుంది. అందుకు నెటిజన్లు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.