Advertisement
మనం ఒక సినిమా చూస్తే టైటిల్స్ దగ్గర నుండి ఎండ్ కార్డ్ వరకు కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకుంటాం.. కొన్నేళ్ల తర్వాత ఆ సినిమా టాపిక్ వచ్చినా టక్కున చెప్పేస్తుంటాం..అదే నిన్న క్లాసులో ఏం జరిగింది అంటే మాత్రం బుర్ర గోక్కుంటాం..విజువల్ ఎఫెక్ట్.. సౌండ్ ఎఫెక్ట్ తో కళ్లకి అందంగా కనపడే ఆ సినిమా మన మైండ్లో నిలిచిపోతుంది..కానీ పుస్తకాల్లో ఉన్నది చదువుతూ పోయే మాష్టార్లు తప్ప పిల్లలకు అర్ధం అయ్యేలా..సినిమాలా మన మైండ్లో ఫిక్సయిపోయేలా చెప్పే ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది..అటువంటి ఒక టీచర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది..
చిన్నతనంలో కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ బాటిల్, పెప్సి మరియు మెంటోస్‌లను ఉపయోగించి అగ్నిపర్వతం తయారు చేసినట్లు మీకు గుర్తుందా? మన సైన్స్ ఫెయిర్స్ కోసం మనలో చాలా మంది అగ్నిపర్వత విస్ఫోటనం ఎక్సపెర్మంట్ చేసినప్పటికీ, మామూలుగానే సైన్సంటే భయం,ఇంక ఈ మండడం ఏంటో,ఆ లావా ఏంటో..ఆ వాయువులు ఏంటో అని నిద్రపోయే స్టూడెంట్సే ఎక్కువ..కానీ అతి భయంకరమైన సబ్జెక్ట్ సైన్సును కూడా చాలా సులభతరంగా పిల్లలకు అర్దంయ్యేలా చెప్తున్నాడు మహారాష్ట్రలోని వార్ధా జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు.
Advertisement
అగ్నిపర్వతం లాంటి సబ్జెక్ట్ ని చిన్న మొటిమతో పోల్చాడు.. మన ముఖం మీద మొటిమ ఎలా అయితే పెరిగిపెరిగి పెరిగి ఒకేసారి చిట్లుతుందో అలా అగ్నిపర్వతం కూడా పేలుతుందనేది సింపుల్ పదాల్లో చెప్పడమే కాదు..తన మాటల్లో ఎక్సప్రెషన్స్ తో పిల్లలకు ఈజీగా అర్దం అయ్యేలా ఆన్లైన్ క్లాసులో పాఠం బోధించాడు..ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు ఒక IFS అధికారి.. నేను బాధపడుతున్నాను ఇతని దగ్గర చదువుకోనందుకు అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ గా మారింది.
వోల్కనో కాదు LOL కనో అంటూ కొందరు కామెంట్ చేస్తే..ఇతని క్లాసులో ఒక్కరు కూడా నిద్రపోరు అనేది మరో నెటిజన్ కామెంట్.. సైన్స్ ని కూడా ఇలా సింపుల్ గా చెప్పే టీచర్ ని నేనిప్పటివరకు చూడలేదని ఒక వ్యక్తి కామెంట్ చేసాడు.. ఇతను ఇప్పుడు అందరి ఫేవరెట్ టీచర్ అయిపోయాడు..మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి అతడు పాఠం చెప్తున్నది మరాఠిలో ..తను చెప్పేది పూర్తిగా అర్దం కాకపోయినా అతను చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంది..!
I regret not having studied under him?
Teacher teaching VOLCANO in online class…. pic.twitter.com/qdLXD9HmtNAdvertisements
— Susanta Nanda IFS (@susantananda3) August 27, 2020
Advertisements