Advertisement
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులందరూ ఇళ్లలోనే ఉండి ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నారు. కరోనా వల్ల పాఠశాలలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో తెలియదు కానీ.. స్కూల్స్ మాత్రం విద్యార్థులకు ఎప్పుడో ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించేశాయి. దీంతో చాలా మంది ఉపాధ్యాయులు నూతన పద్ధతుల ద్వారా టెక్నాలజీని వినియోగించుకుని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఆ ఉపాధ్యాయుడు మాత్రం ఇంకాస్త ముందు వెళ్లి విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలను బోధిస్తున్నాడు.
Advertisements
Advertisement
కర్ణాటకలోని బెళగావి జిల్లా భుతరమనహట్టి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బసవరాజ్ సుంగరి అనే ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో పాఠాలను ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాడు. అందుకు గాను అతను అగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలను ఎంచుకుని 3డీలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. దీని వల్ల ఆయా పాఠ్యాంశాల్లోని అంశాలకు చెందిన వస్తువులు మన ఎదుటే ఉన్నట్లు అనిపిస్తుంది.
ఉపాధ్యాయుడు బసవరాజ్ అలా ఆ సాంతికేక పరిజ్ఞానంతో సౌర వ్యవస్థ, సూర్యుడు తదితర అంశాలకు చెందిన పాఠాలతోపాటు ఏనుగుకు సంబంధించిన పాఠాలను చెబుతున్న వీడియోలను పోస్టులో చూడవచ్చు. నిజానికి సౌరవ్యవస్థ, సూర్యుడు, ఏనుగు, తేనెటీగలు అతని వద్ద లేవు. కానీ అగ్‌మెంటెడ్, వర్చువల్ రియాలిటీల వల్ల చూసేవారికి అవి అతని ఎదురుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో విద్యార్థులకు కూడా పాఠాలు చక్కగా అర్థమవుతాయి. అందుకనే అతను ఇలా వినూత్న రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తున్నాడు. కాగా బసవరాజ్ క్రియేట్ చేసిన ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అతన్ని అందరూ అభినందిస్తున్నారు.
Advertisements