Advertisement
పరీక్షల్లో చీటింగ్ చేయడం అనేది కొందరికి సరదా. కొందరు సమాధానాలు తెలియక, పాఠాలు సరిగ్గా వినక, చదువు రాక చీటింగ్‌కు పాల్పడుతారు. చిట్టీలు తీసుకొచ్చి కాపీ కొడతారు. ఇంకొందరు హైటెక్ విధానంలో కాపీ చేసేందుకు యత్నిస్తారు. అయితే టీచర్లు కూడా ఏమీ తక్కువ తినలేదు. స్టూడెంట్లు భిన్న రకాల మార్గాల్లో చీటింగ్ చేస్తారని తెలిసే వారు కూడా అనేక రకాలుగా ఆ చీటింగ్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తారు. ఈ క్రమంలోనే టీచర్లు పలు రకాలుగా స్టూడెంట్లను చీటింగ్ చేయనీయకుండా, కాపీ కొట్టనీయకుండా ఎలా అడ్డుకున్నారో.. కింద ఇచ్చిన చిత్రాలను పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఫన్నీగా కూడా అనిపిస్తాయి.
1.సెల్ ఫోన్లను వాడనీయకుండా అడ్డుకుంటే చాలు, కాపీ కొట్టకుండా చూడవచ్చు.
2.యాంటీ చీటింగ్ కార్డ్ బోర్డు బాక్సులు. వీటిని పెట్టుకుంటే చీటింగ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పవచ్చు.
Advertisements
3.ఇన్విజిలేటర్ అంత ఎత్తులో కూర్చుంటే స్టూడెంట్లు కాపీ చేస్తుందీ, లేనిదీ సులభంగా తెలిసిపోతుందన్నమాట.
4.గుర్రాల కళ్లకు గంతలు కట్టినట్లు కట్టారు చూడండి. ఇలా చేసినా చీటింగ్‌కు పాల్పడడం కష్టమే.
5.బీహార్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థులు కాపీ కొట్టకూడదని చెప్పి వారిని అండర్‌వేర్లతో కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. 2016లో ఈ సంఘటన దుమారం రేపింది.
Advertisement
6.సీసీటీవీల ద్వారా నిఘా ఉంచితే కాపీ చేయలేరా ? చేసే వారు చేస్తారు.
7.చైనాలో వైర్‌లెస్ డివైసెస్ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి స్టూడెంట్లను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు.
8.యాంటీ చీటింగ్ హ్యాట్స్, భలే ఉన్నాయే..
9.యాంటీ చీటింగ్ గొడుగులు.
10.ఇప్పుడే కాదు, పురాతన కాలంలోనూ యాంటీ చీటింగ్ టోపీలు ఉన్నాయన్నమాట.
11.స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు చూడండి..
Advertisements
ఎగ్జామ్ లలో స్టూడెంట్స్ కాపీయింగ్‌కు పాల్పడినా, చీటింగ్ చేసినా పసిగట్టేందుకు ఇలా అనేక మంది ఉపాధ్యాయులు అనేక రకాల టెక్నిక్‌లను పాటించారు. అయినప్పటికీ కాపీయింగ్ చేసేవారు చేస్తారు.. దొరికేవారు దొరుకుతారు.. అది వేరే విషయం.. ఏది ఏమైనా ఈ టెక్నిక్‌లు భలే ఉన్నాయి కదా..!