Advertisement
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది 10 వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న 5 లక్షల మంది పాస్ అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.!
పాస్ సరే మరి మార్కుల పరిస్థితేంటి?:
10 వ తరగతిలో గ్రేడింగ్ విధానం కొనసాగుతుంది. 100 మార్కులకు గాను 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్స్ ( పాఠశాల స్థాయిలో ) కు 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్ కు ఉంటాయి. ఇప్పటికే ప్రతి విద్యార్థికి సంబంధించిన ఈ ఇంటర్నల్ అసెస్మెంట్స్ మార్క్స్ విద్యాశాఖ కు చేరాయి.!
గ్రేడింగ్ తీసే విధానం:
Advertisement
- ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ × 5 = టోటల్ ( దీనినే ఫైనల్ మార్క్స్ గా పరిగణించే అవకాశం)
- ఇంటర్నల్ అసెస్మెంట్ కు 20 మార్కులు + SA-1 కి 40 మార్కులు + ఫ్రీఫైనల్ కు 40 మార్కులు = 100 మార్కులు
- ఇప్పటికే జరిగిన 2 పరీక్షలు కూడా రద్దు చేసే అవకాశం.!
దీంట్లో రెండవ మార్గాన్ని ఎన్నుకుంటే ... స్కూల్స్ లో ఇప్పటికే నమోదైన మార్కులు రాత్రికి రాత్రే మారిపోయే సమస్య ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆయా పాఠశాలలు ఇష్టానుసారంగా మార్కులను సరిచేసే అవకాశముంది.! ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి విధానమే ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతుంది.!
Advertisements
ఈ ఆల్ పాస్ నేపథ్యంలో … మార్కులనే ప్రామాణికంగా తీసుకొని అడ్మీషన్స్ ను ఖరారు చేసే IIIT లు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి …ఎంట్రన్స్ టెస్ట్ లో వచ్చిన మార్కులను బట్టి అడ్మీషన్స్ ఇచ్చే అవకాశముంది.!
ఇవన్నీ మన ముందున్న పరిష్కార మార్గాలు మాత్రమే… ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ .!
Advertisements