Advertisement
గాసిప్స్….ఈ పదం సినిమావాళ్ళకు చాలా కామన్.! మరీ సోషల్ మీడియా వచ్చాక ఇంకా కామన్ అయిపోయింది! ఇదిగో తోక అంటే అదిగో పులి అనే విధంగా ప్రచారమౌతాయి సినీతారల గురించి పుకార్లు! గాసిప్స్ సాధరణమే అయినప్పటికీ ఈ 9 మంది హీరోయిన్స్ మీద మాత్రం ఎటువంటి గాసిప్స్ రాలేదు.! సినీ ఎంట్రీ, స్టార్ హోదా, సైలెంట్ గా పెళ్లి…. వైవాహిక జీవితంలో బిజీ….ఇలా తమ కెరీర్ ను ప్లాన్ చేసుకున్న ఆ 9 మంది హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం!
1. గౌతమి:
పరిధి దాటి ప్రవర్తించిన దాఖలాలు లేవు.! చాలా పద్ధతి గల ఫ్యామిలీ నుంచి వచ్చింది షూటింగ్ కు సైతం తల్లితో వచ్చి తల్లితోనే ఇంటికెళ్లిపోయేది. కానీ మ్యారేజ్ విషయంలో రెండు సార్లు భంగపడింది. తన చాయిస్ ను ఎంచుకోవడంలో మిస్టేక్ చేసింది .కానీ సినిమా ఇండస్ట్రీలో ఈమెపై మాత్రం ఎలాంటి గాసిప్స్ లేవు.
Advertisements
2. సుమలత:
మొదటినుండి డీసెంట్ రోల్స్ చేస్తూ వొచ్చారు . ఎంత అందం ఉన్నా తెలుగులో మాత్రం టాప్ హీరోయిన్ కాలేకపోయారు . ఈమెపై కూడా ఎలాంటి గాసిప్స్ లేవు! మంచి లైఫ్ పార్ట్ నర్ దొరికాడు. చక్కగా లైఫ్ లో సెటిల్ ఐపోయారు.
3. ఊహ:
సినిమాల్లోకి వొచ్చిరాగానే హీరో శ్రీకాంత్ తో ప్రేమ…. అందుకే కొన్ని సినిమాలు చేసాక చక్కగా శ్రీకాంత్ నే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు.
4. సుజాత:
సుజాత సినిమాలో స్టార్ హీరోయిన్ అయ్యేనాటికే ఆమె ఇద్దరు పిల్లల తల్లి ! చాలా డీసెంట్ గా ఒక పరిధి దాటకుండా నటిస్తూ తన కెరీర్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈమె మరణం వరకు కూడా ఈమెపై ఒక్క గాసిప్ కూడా లేదు!
Advertisement
8. నమ్రతా శిరోద్కర్:
మిస్ ఇండియా కిరీటంతో మొదటినుండి సినిమా ఆఫర్స్ బాగానే ఉన్నాయి . చిరంజీవి అంజి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా , మహేష్ బాబు తో చేసిన వంశీ సినిమా ముందుగా రిలీజ్ అయింది . ఆ సినిమాతోనే మహేష్ తో ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవడం జరిగింది . ఇటీవలే డ్ర ….గ్స్ విషయంలో ఈమె పేరు ప్రస్తావనలోకి వచ్చినప్పటికీ ఇండస్ట్రీ వాళ్ళ మీద వచ్చేలాంటి గాసిప్స్ మాత్రం రాలేదు.
7. రేణు దేశాయ్:
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పవన్ కళ్యాణ్ తో అని ఆవిడే అనేకసార్లు చెప్పారు . 7 ఇయర్స్ లివింగ్ రిలేషన్ షిప్ తర్వాత వారిద్దరు పెళ్లిచేసుకున్నారు . తర్వాత కొన్నాళ్ళకి విడిపోయారు. అది మినహా ఆవిడ మీద ఏ గాసిప్స్ లేవు.
7. భాగ్య సింగ్:
రాత్రికి రాత్రే బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిపోయింది భాగ్య సింగ్ . కానీ ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సినిమాలకు దూరం అయ్యి ప్రస్తుతం భర్తతో హ్యాపీగా గడుపుతుంది.
8. భూమిక:
భూమిక ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా తన పరిధి దాటి అసభ్యానికి తావివ్వకుండా చక్కగా చేయాల్సినంత కాలం సినిమాలు చేసి., పద్ధతిగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది భూమిక .
9. లయ:
అస్సలు గాసిప్స్ లేని హీరోయిన్ ! హీరో సాయి కిరణ్ ని మాత్రం పెళ్ళిచేసుకోవాలి అనుకున్నారని వాళ్లే ఓపెన్ గా చెప్తారు . ఇద్దరి ఫ్యామిలీస్ లో ఉన్న కొన్ని కారణాల వల్ల అది జరగకపోయినా . తర్వాత ఒక NRI ని పెళ్లిచేసుకొని హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో కార్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలయ్యాయంటూ పుకార్లు వచ్చినా అది తప్పని ఆమె తెలియజేశారు!
Advertisements