Advertisement
సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మొత్తం బాధ్యత దర్శకులు తీసుకుంటారు.అందుకే వాళ్ళని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటుంటారు.మరి అలాంటి దర్శకులలో కొందరు తమ చిత్రాలలో తప్పకుండా ఓ యాక్టర్ తమ ప్రతి చిత్రంలో రిపీట్ చేస్తుంటారు మరి వారు ఎవరు ఇంతకీ వాళ్ళు రిపీట్ చేసిన నటులెవ్వరో ఇప్పుడు చూద్దాం.
ఎస్ ఎస్ రాజమౌళి :
ఈయన చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్టే.టాలీవుడ్ లో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ఈయన పేరు చెప్పచ్చు.మరి అలాంటి రాజమౌళి గారి చిత్రాలలో యాక్టర్ చంద్రశేఖర్ ఎక్కువగా కనిపిస్తుంటారు.చంద్రశేఖర్, రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి,సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ వంటి చిత్రాలలో కనిపిస్తారు.
Advertisements
త్రివిక్రమ్ శ్రీనివాస్ :
మాటల మాంత్రికుడిగా పేరున్న ఈయన చిత్రాలలో అమిత్ అంకిత్, ప్రభు ఎక్కువగా కనిపిస్తుంటారు.ముందుగా అమిత్ అంకిత్( ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలలో కనిపిస్తారు.) ఇక ప్రభు ( అతడు జల్సా ఖలేజా జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి) చిత్రాలలో కనిపిస్తారు.
హరీష్ శంకర్ :
ఈయన ఫ్లాప్స్ తో సతమవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి సాలిడ్ హిట్ ఇచ్చి ఆయనను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించారు.ఈయన చిత్రాలలో రావు రమేష్ గారు ఎక్కువగా కనిపిస్తుంటారు.రావు రమేష్ ,హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిరపకాయ,గబ్బర్ సింగ్ ,రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం చిత్రాలలో కనిపిస్తారు.
Advertisement
పూరి జగన్నాథ్ :
అతి తక్కువ టైంలో సినిమాలు చేస్తారు.ఈయన చేసిన సినిమాలు అయితే సూపర్ హిట్ లేదా హాంఫట్.ఈయనతో ఏ హీరో సినిమా చేసిన వాళ్ళకి వెంటనే మాస్ ఫాలోయింగ్ అనేది పెరిగిపోతుంది.మరి అలాంటి పూరీ జగన్నాథ్ సినిమాలలో ఎక్కువగా సుబ్బరాజు కనిపిస్తుంటాడు.సుబ్బరాజు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు నేనింతే, గోలీమార్ ,దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మాన్, ఇద్దరమ్మాయిలతో వంటి పూరీ సినిమాలలో కనిపిస్తాడు.
శ్రీకాంత్ అడ్డాల :
మాస్ వైపు నడుస్తున్న టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని తను చేసే క్లీన్ క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్నారు.ఈయన దర్శకత్వం వహించిన కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలలో రావు రమేష్ గారు కనిపిస్తారు.
కృష్ణవంశీ :
ఎంతోమంది నేటితరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలలో బ్రహ్మాజీ,ఆహుతి ప్రసాద్ కనిపిస్తుంటారు.
రామ్ గోపాల్ వర్మ :
సంచలనాలకు కేంద్రబిందువైన ఈయన సినిమాలలో ఎక్కువగా తనికెళ్ళ భరణి గారి కనిపిస్తుంటారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ, రక్త చరిత్ర, అప్పల్ రాజు, రౌడీ చిత్రాలలో కనిపిస్తారు.
Advertisements