Advertisement
పెండ్లి పత్రికలు….తమ స్థాయిని, తమ ఆలోచనలను ప్రతిబింబించేలా తయారుచేయించడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్! ATM ఇన్విటేషన్ కార్డ్, ఆధార్ స్టైల్ కార్డ్ …ఇలా జనాలు తమ పెండ్లి ఆహ్వాన పత్రికలో అనేక రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి సెలెబ్రిటీల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం! ( గత కొన్ని రోజులుగా ఈ వెడ్డింగ్ కార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.)
- NTR & లక్ష్మీ ప్రణతి
వివాహం: మే 5, 2011
కార్డ్ విశిష్టత : సింపుల్ గా పూల దండతో అలంకరించడం
2) రామ్ చరణ్ & ఉపాసన:
వివాహం: 14th June, 2012
కార్డ్ విశిష్టత : కార్డ్ పై ఉన్న లోగో…. KC – కొణిదెల చరణ్
Advertisements
3) అల్లు అర్జున్ – స్నేహారెడ్డి:
వివాహం: 6th March, 2011
కార్డ్ విశిష్టత : కార్డ్ సింపుల్ యే….అందులో పెట్టి పంచిన స్వీట్స్ కాస్ట్లీవి!
4) నాగచైతన్య- సమంత:
వివాహం: October 6 & 7
కార్డ్ విశిష్టత : అక్టోబర్ 6 మరియు 7 తేదీల్లో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో పెళ్లి చేసుకోవడం
5) గోపీచంద్-రేష్మా
వివాహం: 12-05-2013
కార్డ్ విశిష్టత : గోపిచంద్ నాన్న గారైన తొట్టెంపూడి కృష్ణ గారి ఫోటోతో కార్డ్ ను ప్రింట్ చేయించడం
Advertisement
6) నరేష్ – విరుపమ
వివాహం: 29-05-2015
కార్డ్ విశిష్టత : అచ్చమైన తెలుగులో అందంగా ఉన్న కార్డ్
7) ప్రియమణి- ముస్తఫా రాజ్
వివాహం: 24 th August, 2017 ( Reception)
కార్డ్ విశిష్టత :హిందూ అయిన ప్రియమణి, ముస్లీం అయిన ముస్తఫాను ప్రేమ వివాహం చేసుకున్నా….అంగీకరించిన ప్రియమణి పేరెంట్స్ తమ కూతురి రిసెప్షన్ కు ఈ పత్రిక ద్వారా ఆహ్వనం పలికారు
8) క్రిష్ – రమ్య
వివాహం: 7ఆగస్టు ,2016
కార్డ్ విశిష్టత :నా సినీ జీవితం గమ్యంతో మొదలైంది….నిజమైన నా జీవితం రమ్యంగా మొదలవుతుంది అంటూ తన పెండ్లి పత్రికను తనే రాయించుకున్నాడు. కానీ వీరు పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నారు.
9) చిరంజీవి – సురేఖ:
వివాహం: ఫిబ్రవరి 20, 1980
కార్డ్ విశిష్టత : సింపుల్ గా ఇంగ్లీష్ లో ప్రింట్ చేయించబడిన కార్డ్….. పెళ్లి మద్రాస్ లో జరగడం విశేషం
10) NTR- బసవ తారకం
వివాహం : మే 2, 1942
కార్డ్ విశిష్టత: స్వాతంత్ర్యానికి పూర్వం ప్రింట్ చేయబడిన కార్డ్….అప్పటి కార్డ్ లు చాలా అరుదుగా కనిపిస్తాయి!
Advertisements