Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

IPL లో ఆడుతున్న తెలుగు ప్లేయ‌ర్స్ ఎంత‌మంది? వాళ్లు ఏ టీమ్ కు ఆడుతున్నారు? వేలంలో వాళ్లు ప‌లికిన ధ‌ర ఎంత‌?

Advertisement

IPL తీసుకొచ్చిన‌ప్పుడు చెప్పిన మాట‌…. స్థానిక ఆట‌గాళ్లను ప్రోత్సాహిస్తాం. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంటి? ఆట పేరుతో కాసుల వేట‌, కోట్ల‌కు కోట్లు పెట్టి విదేశీ ఆట‌గాళ్ల‌ను ప‌ట్టుకొస్తున్నారు….ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ లోక‌ల్ ప్లేయ‌ర్స్ ను ప‌క్క‌న పెడుతున్నారు. ఈ విష‌యంలో తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితి మ‌రీ దారుణం…. IPL మొత్తం మీద మన తెలుగు వాళ్లు ఉన్న‌ది న‌లుగురే న‌లుగురు….వారిలో ఇద్ద‌ర్ని ఇప్ప‌టి వ‌రకు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు.

IPL లో ఆడుతున్న తెలుగు ప్లేయ‌ర్స్ గురించి ఇప్పుడు చూద్దాం!

అంబటి రాయుడు :
ప్ర‌స్తుతం CSK టాప్ ప్లేయ‌ర్ గా ఉన్న అంబ‌టి రాయుడును ఆ జ‌ట్టు 2.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. గుంటూరుకు చెందిన అంబ‌టి రాయుడు 2003 లో టీమ్ ఇండియా అండ‌ర్ -19 జట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. అద్భుత‌మైన ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ అత‌నికి ఇవ్వాల్సినన్ని అవ‌కాశాలు మాత్రం ఇవ్వ‌లేద‌నే చెప్పాలి.

 

సిరాజ్ :
మంచి ఫేస్, స‌హ‌జ‌సిద్ద‌మైన స్వింగ్ తో బౌలింగ్ చేయ‌గ‌ల సిరాజ్….అనూహ్యంగా వెలుగులోకి వ‌చ్చాడు. రంజీ ట్రోఫిలో అత‌ని బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను దృష్టిలో ఉంచుకొని…2017లో స‌న్ రైజ‌ర్స్ సిరాజ్ ను 2.60 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం ఇత‌ను RCB కి ఆడుతున్నాడు.! సిరాజ్ ది హైద్రాబాద్.

Advertisements

Advertisement

భ‌వంక సందీప్ :
హైద్రాబాద్ కు చెందిన 27 ఏళ్ల సందీప్ ను SRH కొనుగోలు చేసింది. ముస్తాక్ అలీ T20లో 261 ప‌రుగులు చేసి SRH మేనేజ్మెంట్ దృష్టిని ఆక‌ర్షించాడు. ఇత‌ని బేస్ ప్రైజ్ అయిన 20 ల‌క్ష‌ల‌కు SRH సందీప్ ను వేలంలో కొనుక్కుంది! ఈ IPL ల్లో ఇంత‌వ‌ర‌కు బ్యాంటింగ్ చేసే అవ‌కాశ‌మైతే రాలేదు.!

పృథ్వీరాజ్:
గుంటూరు జిల్లాకు చెందిన మ‌రో తెలుగు ఆట‌గాడు….22 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌల‌ర్ పృథ్వీరాజ్.! త‌ను ఆడిన మొద‌టి రంజీ మ్యాచులో త‌మిళ‌నాడుపై ఏకంగా ఆరు వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇత‌డిని 2019లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 20ల‌క్ష‌ల( బేస్ ప్రైజ్) కు కొనుగోలు చేసింది. ఇత‌ను ప్ర‌స్తుతం SRH లో ఉన్నాడు.

Advertisements