Advertisement
ఉత్తర భారతదేశంలో బాలీవుడ్ సినిమాలదే పెత్తనం..లోకల్ లాంగ్వేజెస్ లో సినిమాలు వచ్చినా అవి చాలా చిన్నవి. అదే దక్షిణ భారతదేశం నుండి (తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ ) హిందీ సినిమాలను సైతం బీట్ చేయగల దమ్మున్న సినిమాలు వస్తుంటాయి. ఇంత పోటీ ఉన్న సౌతిండియా లో ది బెస్ట్ ఇండస్ట్రీ ఏది? అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కొన్ని విభాగాలుగా పరిశీలించాల్సి వస్తుంది. అదే పరిశీలన ఇప్పుడు మనం చేద్దాం!
పాపులారిటీ:
తెలుగు , తమిళ సినిమాలకున్న పాపులారిటీ….మళయాలం, కన్నడలో కనిపించదు. ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఎక్కువగా ఉండడం, సినీ నటులకు విపరీతమైన క్రేజ్ ఉండడం థియేటర్స్ కూడా ఎక్కువగా ఉండడం, పాన్ ఇండియా నటులు, దర్శకులు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడంతో…. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు పాపులారిటీ ఎక్కువ!
వైవిధ్యం
వైవిధ్యమైన సినిమాలు తమిళ్ నుండి చూడొచ్చు. కామెడీ ,హర్రర్, శాడ్ ఎండింగ్ , లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, ఆర్ట్ బేస్డ్ సినిమాలు ….ఇలా వైవిధ్యమైన కథాంశాల పరంగా తమిళ్ ఇండస్ట్రీ సౌతిండియాలో టాప్ లో ఉంది!
Advertisement
Advertisements
క్వాలిటీ
టేకింగ్ పరంగా…. అయితే తెలుగు, తమిళ్ లే టాప్, కానీ సినిమా స్టోరీల పరంగా మళయాలం ఇండస్ట్రీ క్వాలిటీ సౌతిండియాలో ఎవ్వరికీ అందనంత టాప్ లో ఉంటుంది!
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్ చేయడంలో తెలుగు సినిమాలే మొదటి వరుసలో ఉంటాయి. హీరో ఎలివేషన్స్, డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్, అదరగొట్టే స్టెప్స్, గాల్లో చేసే ఫైటింగ్ లు…పక్కా పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో తెలుగు ఇండస్ట్రీ తోపు.!
స్థానికులకే అవకాశాలు?
ఈ విషయంలో తెలుగు లాస్ట్ లో ఉంటే .., మళయాళం ఇండస్ట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. మ్యాగ్జిమమ్ వారి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ లో అందరూ లోకల్ వాళ్లే ఉంటారు.
Advertisements
రిమేక్స్…
ఇతర భాషల్లోకి రిమేక్స్ అవ్వడం విషయంలో… తెలుగు సినిమాలు అన్నింటికంటే ముందుంటాయి. తర్వాత తమిళ్, ఆ తర్వాత మళయాళం సినిమాలు రిమేక్ అవుతుంటాయి.!
టోటల్ గా …..సౌతిండియాలో సినీ ఇండస్ట్రీస్ కి ర్యాంకింగ్స్ ఇస్తే…
1. మళయాళం
2. తెలుగు
3. తమిళ్
4. కన్నడ