Advertisement
యాంకర్ లను స్టార్ యాంకర్స్ గా మార్చేవి ప్రోగ్రామ్స్….ఈ ప్రోగ్రామ్స్ యే సుమను టాప్ లెవల్లో నిలబెట్టాయి.! అందుకే అలీ, రోజా , సాయికుమార్ లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు సైతం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే….కానీ ఈ ప్రోగ్రామ్స్ లో ఇచ్చే క్యాష్ ప్రైజ్ గురించే చాలా మందికి డౌట్… లక్షలు లక్షలు గెలుపొందారు అంటారు….మరి నిజంగానే అంత డబ్బిస్తారా? ఈ విషయం ఇప్పుడు డీటైల్డ్ గా తెల్సుకుందాం!
- ఈ షోలు అన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి… ఇందులో పాల్గొనే సెలెబ్రిటీలకు మాత్రం వారి ఇమేజ్ ని బట్టి ఒక షో కి 5 నుండి 15 వేల వరకు ఇస్తారు . వారు ఆ గేమ్ షోలో గెలిచేది పోగొట్టుకునేది అంతా యాక్టింగ్ మాత్రమే!కానీ వాళ్ళని అడిగే ప్రశ్నలు మాత్రం వారికి ముందుగా చెప్పరు , అవి మాత్రం వారి సొంతంగా చెప్పాల్సిందే!
- ఢీ లాంటి రియాలిటీ షో లలో మాత్రం గెలిచిన వారికి మాత్రం నిజంగానే ప్రైజ్ మని ఇస్తారు కానీ 40% టాక్స్ కట్ చేసి ఇస్తారు .
- సినిమా ప్రమోషన్ కోసం కొంత మంది సెలెబ్రిటీలు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు వెళుతుంటారు. వారికి ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వరు.
క‌్యాష్ ప్రోగ్రామ్ లో కింద పడే వస్తువుల విషయమేంటి??
Advertisement
సుమ క్యాష్ ప్రోగ్రాం లాస్ట్ లెవల్ లోని…. పకడో, పక్కడో రౌండ్ లో పై నుండి కింద పడి పగిలిపోయే సామాన్లు ఒరిజినలా? కాదా? అనే డౌట్ చాలా మందికి ఉంది… అవి నిజంగా ఒరిజినల్ సామాన్లే కానీ బ్రాండ్ వి కావు…. పాతవి, సెట్ చేసినవి మాత్రమే!
ఆ సామాన్ల మొత్తం విలువ కూడా 10 వేలకు మించి ఉండదు! అందుకే కాస్త హైప్ కోసం ఆ సామన్లను నిజంగానే పగులగొడతారు.
Advertisements
పార్టిసిపేట్స్:
స్టార్ మహిళ , మోడ్రన్ మహాలక్ష్మి లాంటి ప్రోగ్రాంలకు సెలబ్రిటీలను కాకుండా సామాన్యులను ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేస్తారు . అందుకే ఈ గేమ్ షోస్ అంతగా పాపులర్ అయ్యాయి . ఈ షో లో పాల్గొనాలి అంటే అందం తో పాటు యాక్టింగ్ కూడా రావాలి . వీరికి కూడా ఎటువంటి ప్రైజ్ మని ఉండదు , కానీ వీరు గెలుచుకునే గిఫ్ట్స్ మాత్రం వీరికే ఇస్తారు. వీరు కూడా ప్రశ్నలకు సొంతగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది
జూనియర్ ఆర్టిస్టులు:
Advertisements
చాలా షోలకు ఆడియన్స్ గా కనిపించే వారంతా … జూనియర్ ఆర్టిస్ట్ లే! వారికి రోజుకు 500 నుంచి 700 రూపాయలు ఇస్తారు . ఒకే రోజు మూడు ఎపిసోడ్స్ షూట్ చేస్తారు . అప్పుడు వారు డ్రెస్ లు మార్చుకొని అటు ఇటు ప్లేస్ లు మారి కూర్చుంటారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది జూనియర్ ఆర్టిస్ట్స్ కి బదులుగా ఆ ప్లేస్ లో కాలేజీ స్టూడెంట్స్ ని తీసుకొని వస్తున్నారు , వారికి ఎటువంటి రెమ్యూనరేషన్ ఉండదు , కేవలం భోజనాలు ఏర్పాటు చేస్తారు . ఇలా చేయడం ద్వారా ఖర్చు తక్కువ అవ్వడమే కాకుండా స్టూడెంట్స్ ద్వారా షోకి రేటింగ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి!