Advertisement
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వాటి గురించిన విశేషాలను మనం తెలుసుకుంటూ పోతుంటే మనకు ఆశ్చర్యం, విస్మయం కలుగుతాయి. అలాంటి పలు ఆలయాలకు చెందిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కామాఖ్య ఆలయం, అస్సాం:
అస్సాంలోని గౌహతిలో ఈ ఆలయం ఉంది. ఇది దేశంలోని 108 శక్తి పీఠాల్లో ఒకటి. ఒకప్పుడు శివుడు తన భార్య పార్వతి (సతి) ఇక్కడ మంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకుంటే తీవ్ర కోపోద్రిక్తుడై ఆమె శరీరంతో ఇక్కడ శివ తాండవం చేశాడు. దీంతో ప్రళయం రాసాగింది. ఈ క్రమంలో విష్ణువు సతికి చెందిన శరీరాన్ని ముక్కలుగా నరికి ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రాంతానికి విసిరేసి శివుడి కోపాన్ని చల్లార్చాడు. ఇక సతి యోని పడిన ప్రదేశంగా ఈ ఆలయం పేరుగాంచింది. దీన్ని కామాఖ్య ఆలయం అని పిలుస్తారు.
2. కేదార్‌నాథ్ ఆలయం:
Advertisements
కేదార్‌నాథ్ కు వరదలు వచ్చినప్పుడు ఈ ఆలయం, దాని ఎదురుగా ఉన్న నంది చెక్కు చెదరలేదు. అలాగే ఆలయంలో తలదాచుకున్న వారు కూడా బతికి బట్టకట్టారు. కానీ వరదల్లో మాత్రం చాలా మంది చనిపోయారు. అంతటి భారీ వరద వచ్చినా ఆలయం, నంది చెక్కు చెదరకుండా ఉండడం ఇప్పటికీ విశేషమే.
Advertisement
3. హనుమాన్ ఆలయం, జగ్నెవా:
ఉత్తరప్రదేశ్‌లోని జగ్నెవాలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఓ బోరింగ్ పంపు దానికి నీటికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సాధువు ఇక్కడికి వచ్చి బోరు నీటిని ఔషధగుణాల నీటిగా మార్చాడట. దీంతో ఆ నీటిని తాగితే అన్ని వ్యాధులు నయమవుతున్నాయని స్థానికులు నమ్మి ఆ బోరు నీటిని వారు తాగుతున్నారు.
4. స్తంభేశ్వర్ ఆలయం:
అరేబియా మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఖంభత్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్రంలో అలల ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పైకి తేలి మనకు కనిపిస్తుంది. మిగిలిన సమయాల్లో ఆలయం మునిగి ఉంటుంది. ఆలయ శిఖరం మాత్రమే ఆ సమయంలో మనకు కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం అక్కడికి భక్తులు వస్తుంటారు.
Advertisements