Advertisement
తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా ప్రజాప్రయోజనాల దాఖలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవైనా ప్రాజెక్టులు, నీటిపారుదల పథకాలు ప్రవేశపెట్టినపుడు, ఎన్‌కౌంటర్లు జరిగినపుడు సహజంగానే ప్రజాప్రయోజనాలు దాఖలవడం, దానిపై న్యాయస్థానాల్లో విచారణ జరగడం మనం చూస్తుంటాం. అయితే, ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం మనదేశంలో అమలవడం వెనక చాలా చరిత్ర ఉంది. దీనినే PIL (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) అనికూడా పిలుస్తారు.
Advertisement
రాజ్యాంగం ప్రకారం.. భారతదేశంలోని పౌరుల హక్కులకు భంగం లేదా విఘాతం కలిగినపుడు 32వ నిబంధన ప్రకారం..లోకస్‌స్టాండీ నియమాలకు అనుకూలంగా సామాన్యులు ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రభుత్వాలు లేదా ప్రయివేటువారు చేపట్టిన పనుల వల్ల విస్తృతస్థాయిలో ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగినపుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు, నిరక్ష్యరాస్యులు చాలామందికి చట్టం తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారి తరఫున ఎవరైనా సరే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసే అవకాశం మన న్యాయవ్యవస్థ కల్పించింది. ఇలాంటి పిల్ వేసే సంప్రదాయం తొలుత అమెరికాలో కల్పించారు.
Advertisements
ఈ పిల్ వేసే వ్యక్తుల లక్ష్యం కేవలం ప్రజలకు మేలు చేసేలా మాత్రమే ఉండాలి. ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉండకూడదు, అదేవిధంగా ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, పాపులారిటీ కోసం పిల్ వేయకూడదు. ఒకవేళ వేస్తే.. వారికి న్యాయస్థానం జరిమానా కూడా విధిస్తుంది. పలుమార్లు న్యాయస్థానాలు స్వయంగా సుమోటోగా కూడా కేసులు నమోదు చేస్తాయి. పేదవారు రాసిన ఉత్తరాలకు లేదా వార్తపత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలను చూసి హైకోర్టు, సుప్రీంకోర్టులు స్వయంగా సుమోటోగా కేసులు నమోదు చేసిన దాఖలాలు కోకొల్లలు.
Advertisements