Advertisement
నిన్న RTO కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టు కోసం వెళ్లా. షెడ్యూల్డ్ అపాయింట్‌మెంట్ ఉన్నప్పటికీ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకుని లైన్లో నిలుచున్నా. స్త్రీలు, పురుషులకు వేర్వేరు లైన్లు కేటాయించారు. వారిని నేను గమనిస్తున్నా. అయితే ఒక బ్రోకర్ తన కస్టమర్లనే ముందుగా డ్రైవింగ్ టెస్టుకు పంపడం నాకు కనిపించింది. ఆ బ్రోకర్లు ఆ ఆఫీస్ ఉద్యోగుల్లా బిల్డప్ ఇస్తూ రౌడీల్లా ప్రవర్తించారు. దీనిపై కొందరు అక్కడే ఉన్న ఆర్‌టీవో అధికారికి ఫిర్యాదు చేశారు. అయినా ఆ అధికారి ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు.
ఇక బ్రోకర్లతో సంబంధం లేకుండా నేరుగా వెళ్లిన కొందరి అప్లికేషన్లను ఆ ఆర్‌టీవో అధికారి నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం గమనించా. కానీ బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి వెళ్తున్న అందరి అప్లికేషన్లను మాత్రం ఆ అధికారి ఓకే చేశారు. అలాంటి వారి అప్లికేషన్లు ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు. ఇది నాకు చాలా విసుగును, కోపాన్ని తెప్పించింది. కొందరు బ్రోకర్లు వాహనదారుల పక్కనే కారులో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ గేర్లను మారుస్తున్నారు. డ్రైవర్ సీట్లో ఉన్న క్లయింట్లు (టెస్టుకు వచ్చిన వారు) కేవలం క్లచ్, యాక్సలరేటర్‌ను తొక్కుతున్నారు. అయినా ఆ అధికారి అసలు వారి వైపు చూడలేదు.
Advertisement
అయితే అది అంతటితో ఆగలేదు. ఒక బ్రోకర్ ఆ RTO వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. దీంతో అధికారి ఆ బ్రోకర్ తెచ్చిన ఓ క్లయింట్‌కు చెందిన అప్లికేషన్‌ను యాక్సెప్ట్ చేశాడు. అసలు డ్రైవింగ్ టెస్టుకు వెళ్లకుండానే ఆ అధికారి అప్లికేషన్‌ను అలా ఓకే చేయడం నాకు షాకింగ్‌లా అనిపించింది. అయితే అసలు ఆ క్లయింట్‌కు కనీసం యాక్సలరేటర్, క్లచ్‌ను తొక్కడం కూడా తెలియదేమోననిపించింది.
ఇదీ.. మన దేశంలోని ఒక వ్యవస్థకు సంబంధించిన పరిస్థితి. ఇలాంటి వారే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. నాకు నోట మాట రాకుండా అలాగే నిలుచున్నా. వీళ్లు అసలు మనుషులేనా అనుకున్నా. ఆ అధికారి కేవలం కొంత డబ్బుకు ఆశపడి ఇలా చేస్తున్నందుకు నాకు షాక్ తగిలినట్లు అనిపించింది. మన దేశంలో ఇలాంటి బాధ్యతాయుతమైన పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులే ఇలా అవినీతిని, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తే.. అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదనే చెప్పవచ్చు. ఇలాంటి అధికారుల వల్లే మన దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. కాదంటారా..!
— అనురాగ్ ( నాగ్ పూర్ )
Advertisements
Advertisements