Advertisement
హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.. తాజాగా ప్రముఖ గోకుల్ ఛాట్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది ..లాక్ డౌన్ సడలింపులతో ఈ నెల 8న గోకుల్ ఛాట్ ని ఓపెన్ చేశారు..అప్పటి నుండి వందల సంఖ్యలో గోకుల్ ఛాట్ కి వచ్చినట్టుగా సమాచారం..
మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన గోకుల్ ఛాట్ యజమాని విజయా వార్గి(72)కి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది..దాంతో వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించారు..వెంటనే అప్రమత్తం అయిన అధికారులు షాప్ ని మూసి వేసారు.. షాప్ ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు..షాప్ లో పనిచేసే 20మంది పనివాళ్లని కూడా హోం క్వారంటైన్ కి తరలించారు..
Advertisement
క్యాష్ కౌంటర్లో కూర్చునే విజయా వార్గి వినియోగదారులనుండి నేరుగా డబ్బులు తీసుకుంటారు..అతడితో పాటు మరో గుమాస్తాకూడా క్యాష్ కౌంటర్లో సాయంగా ఉంటారు..కరెన్సీ ద్వారానే విజయా వార్గికి కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.. మూడురోజులుగా గోకుల్ ఛాట్ కి ఎవరెవరు వచ్చారు అనే దిశలో దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు..
లాక్ డౌన్ సడలింపుల అనంతరం షాప్ ఓపెన్ చేసినప్పటి నుండి పార్శిల్ ద్వారా ఫూడ్ సప్లై చేస్తున్నారు.. అప్పటి నుండి ప్రతిరోజు వందల మంది వచ్చినట్టుగా సమాచారం. వారందరిని గుర్తించడం అసంభవం కావున..గోకుల్ ఛాట్ కి వచ్చి వెళ్లిన వారికి ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్టుగా అనుమానం ఉంటే హాస్పిటల్ కి వచ్చి టెస్టులు చేయించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరారు అధికారులు..
Advertisements
Advertisements