Advertisement
టెంపర్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌లకు ఇద్దరిని తిరిగి ఫామ్‌లోకి తీసుకువచ్చిన ఈ సినిమాకు వాస్తవానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించాలి. ఈ కథ రాసింది వంశీనే. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాడ్ పోలీసాఫీసర్ పాత్ర రాసుకున్నాడు. చాలాకాలంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి వద్ద కథ రచయితగా పనిచేస్తోన్న వక్కంతం వంశీ ఈ కథతోనే దర్శకుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. నేరుగా కథ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించాడు.
తొలిసారి వేరే కథకు పూరీ డైరెక్షన్..!
కథ ఎన్టీఆర్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చింది అయితే, అప్పటికే అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం లాంటి విజయవంత సినిమాలను కథలను అందించినప్పటికీ వంశీకి దర్శకుడిగా తొలిసినిమా కావడం, తాను కూడా వరసుగా ఫ్లాపులతో ఉండటంతో వంశీకి దర్శకత్వం ఇచ్చే సాహసం ఎన్టీఆర్ చేయలేకపోయాడు. అందుకే కథకు పూరీ జగన్నాథ్ అయితే కరక్టు అని ఫిక్సయ్యాడు. ఈ సినిమాకు ముందు పూరీ కెరీర్ కూడా బాగాలేకపోవడం గమనార్హం. సాధారణంగా తన సినిమాలకు తానే కథ, మాటలు రాసుకునే పూరీకి కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే డైరెక్షన్‌కు ఓకే చెప్పాడు. కానీ మాటలు తానే స్వయంగా రాసుకున్నాడు. ఇంకేం కథ సెట్స్ మీదకు వెళ్లింది.
Advertisements
సంగీతం అనూప్. బీజీఎం మణిశర్మ..!
ఇక ఈ సినిమాకు మొత్తం సంగీతంగా మొదట అనూప్‌రూబెన్స్‌ను అనుకున్నారు. అనుకున్నట్లుగానే అనూప్ మంచి పాటలు అందించాడు. ఇక్కడే పూరీ తన మార్కు ప్రయోగించాడు. సినిమాకు కథతోపాటు నేపథ్యం సంగీతం, డైలాగులే ప్రాణం. కీలకమైన డైలాగులను తానే రాసుకున్నాడు. నేపథ్య సంగీతం కోసం సీనియర్ అయిన మణిశర్మను ఆశ్రయించారు. ఆయన తన అనుభవంతో ప్రేక్షకులకు యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా తన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణంపోశాడు.
Advertisement
కానిస్టేబుల్ మూర్తి..!
ఈ సినిమాలో హీరో తరువాత అంతటి కీలక పాత్ర కానిస్టేబుల్ మూర్తి. నిజాయతీకి నిలువెత్తు రూపమైన మూర్తి పాత్ర కోసం మొదట సీనియర్ నటుడు, హీరో నారాయణ మూర్తిని అనుకున్నారట.! ఈ చిత్రం కోసం పనిచేయాలని దర్శకుడు పూరీ స్వయంగా నారాయణమూర్తిని కలిసి రిక్వెస్ట్ చేశాడు. మీకు ఎంత కావాలో రాసుకోండి.. గురువుగారూ! అంటూ ఓ బ్లాంక్ చెక్‌ను కూడా ఇచ్చాడు పూరీ. కానీ, కమర్షియల్ సినిమాలు చేయడం తన విలువలకు విరుద్ధం అంటూ ఆయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. అయితే, తరువాత ఆ పాత్ర చేసిన పోసాని మురళీ కృష్ణ ప్రేక్షకులను బాగా మెప్పించాడు. తన మార్కు మేనరిజంతో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాడు. ఒకరకంగా ఈసినిమాలో పోసాని రెండో హీరో అని చెప్పాలి.
ఎన్టీఆర్, పూరీ సక్సెస్‌బాట..
Advertisements
2015లో టెంపర్ విడుదల అయిన తరువాత ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ షేడ్‌లో అలవోకగా నటించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. ఫ్లాపులు వెక్కిరించినా.. విజయాన్ని సొంతం చేసుకోవడం తనకు తెలుసంటూ పూరీ మరోసారి చాటిచెప్పాడు. మొత్తానికి కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్, పూరీ తిరిగి విజయాల బాటపట్టారు. అయితే ఈ కథతో దర్శకుడు అవుదామనుకున్న వక్కంతం వంశీ తరువాత 2018లో అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’’ తో దర్శకుడుయ్యాడు.