Advertisement
“ఇన్నేలొచ్చాయ్ ఇంకా ఉద్యోగం రాలేదా?” సొంత అమ్మానాన్న కు లేని బాధ వీళ్ళకెందుకో అర్థం కాదు. మన మంచి కోరి అడుగుతారో? లేదా మనల్ని కించపరచడానికో ….తెలియదు కానీ ప్రతి ఒక్కడు …ఏదో లెక్చర్ ఇస్తుంటాడు ఆడికి వాళ్ళేదో పొడిచినట్టు.! ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను … అలంటి సమయంలో నేను ఓ కథను గుర్తుచేసుకొని …ఓ నవ్వు నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాను …ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు!
ఇంతకీ ఆ కథేంటి? : “The Story of The Pregnant Elephant”
ఒక అడవిలో ఒక కుక్క , ఒక ఏనుగు ఒకేసారి గర్భం దాలుస్తాయి. 3 నెలలు గడుస్తాయి..కుక్క 6 పిల్లలకు జన్మనిస్తుంది. మరో 6 నెలల తర్వాత కుక్క మరో అర డజను పిల్లలకు జన్మనిస్తుంది ….ఇంకో 6 నెలల తర్వాత మరో మారు గర్భం దాల్చిన కుక్క ఈ సారి 10 పిల్లలకు జన్మనిస్తుంది.
Advertisement
ఓసారి ఏనుగు దగ్గరికి వెళ్లి ….”అదేంటి మనిద్దరం ఒకే సారి గర్భం దాల్చాము …నేను ౩విడతలు పిల్లల్ని కన్నాను నువ్వేమో ఇంకా గర్భం తోటే ఉన్నావ్. అసలు నువ్వు గర్భం దాల్చావా…? అంతా ఉత్తదేనా?” అని అడిగింది. దానికి ఆ ఏనుగు….” నేను కనాల్సింది కుక్క పిల్లల్ని కాదు , ఏనుగు పిల్లని టైం పడుతుంది., ఎందుకంటే నా పిల్ల భూమి మీదికి వచ్చిందంటే భూమి కూడా ఫీల్ అవ్వాలి.. అలా రోడ్డు పై నడుస్తుంటే …జనాలంతా ఆగి …ఆశ్చర్యంతో ఆనందంతో చూడాలి., దాని కోసం 2 సంవత్సరాలు పడుతుంది..పట్టనివ్వు…. నువ్వు నీ పని కానివ్వు ఇంకో విడత పిల్లల్ని కను” అని చెబుతుంది.
సో….చెప్పేటోళ్లు మస్త్ ముచ్చట్లు చెబుతారు….నీ లక్ష్యం వైపు నువ్వు పయనించు నీ సక్సెస్ వాళ్లకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇవ్వాలి … ఈ సందర్బంగా నాకు నచ్చిన ఓ సినిమా డైలాగ్ ” సక్సెస్ అంటే స్విగ్గి లో పెట్టిన ఆర్డర్ ఆ ….అలా పెట్టగానే అర్థగంట లో రాడానికి టైం పడుతుంది.”
Advertisements
Advertisements