Advertisement
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న విషయం విదితమే. రాముడు జన్మించిన స్థలం, ఆయన పరిపాలించిన స్థలం.. అయోధ్య.. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఓ అయోధ్య ఉంది తెలుసా.. అవును నిజమే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గొల్లల మామిడాల గ్రామంలో రామాలయం ఉంది. అందులో శ్రీ కోదండ రామస్వామి కొలువై ఉన్నాడు. ఇక ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్నే మరో అయోధ్యగా పిలుస్తారు. దీన్నే కోనసీమ అయోధ్య అని కూడా అంటారు.
ఈ ఆలయంలో ఉన్న గోపురాలపై రామాయణ, మహాభారత, భాగవత పురాణాలకు సంబంధించిన ఘట్టాలను కళాకృతులుగా చెక్కారు. వాటిని అర్థం చేసుకోవాలంటే ఒక్కో కళాకృతిని సుమారుగా 1 గంట పాటు పరిశీలించాల్సి ఉంటుంది.
Advertisements
డ్రోన్ కెమెరాతో తీసిన ఈ ఫోటోలో ఆలయంలో ఉన్న రెండు గోపురాలను పై నుంచి వీక్షించవచ్చు. ఒక గోపురం తూర్పుకు, మరో గోపురం పడమరకు ఉంటుంది.
సాధారణంగా ఆలయ గోపురాల మీదకు ఎక్కేందుకు భక్తులకు అవకాశం ఉండదు. కానీ ఈ ఆలయంలో అలా కాదు. భక్తులు ఆలయ గోపురాల మీదకు ఎక్కవచ్చు. అక్కడి కళాకృతులను పరిశీలించవచ్చు.
ఇక ఆలయంలోని రెండు గోపురాల్లో ఒక గోపురాన్ని మహాగోపురం అని పిలుస్తారు. దాని ఎత్తు 210 అడుగుల వరకు ఉంటుంది. మరో గోపురం ఎత్తు 160 అడుగుల వరకు ఉంటుంది. 1889లో ఈ ఆలయాన్ని నిర్మించారు.
Advertisement
హనుహంతుడు శ్రీరాముడికి సీతా దేవి ఉంగరాన్ని ఇస్తున్న దృశ్యాన్ని ఆలయ గోపురంపై చూడవచ్చు.
మేఘనాథుడి బాణంతో నేలకొరిగి స్పృహ తప్పిన లక్ష్మణున్ని తన ఒడిలో పడుకోబెట్టుకున్న రామున్ని చూడవచ్చు.
శ్రీకృష్ణుడు, అర్జునుడితో మాట్లాడుతున్న బీష్ముడు. మహాభారతంలోని దృశ్యం.
వేణుగోపాల స్వామి అవతారంలో దర్శనమిస్తున్న శ్రీకృష్ణుడి కళాకృతి.
హిరణ్య కశ్యపున్ని సంహరిస్తున్న లక్ష్మీనరసింహ స్వామి.
ఆలయంలోని శ్రీసీతారామచంద్రుల మూల విరాట్ విగ్రహాలు.
ఆలయం చుట్టూ కనువిందు చేస్తున్న పచ్చని పంట పొలాలు.
Advertisements