Advertisement
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో..అక్కడ దేవతలు కొలువై ఉంటారు..అని చెప్పుకునే మనదేశంలోనే ఆఫ్రాల్ ఆడవాళ్లు అంటూ వారికి ఏం రాదు, ఏం తెలియదని కొట్టి పారేస్తుంటాం..కాని మేం చేయలేనిది అంటూ లేదని ఇప్పటి వరకు అనేకమంది ఆడవాళ్లు నిరూపించారు..తాజాగా ముగ్గురు ఆడవాళ్లు తమ మానాన్ని పక్కన పెట్టి మరీ ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడారు..సోషల్ మీడియాలో వైరలవుతూ నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు..
తమిళనాడులోని సిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువకుల కొట్టారై గ్రామానికి క్రికెట్ ఆడటానికి వెళ్లారు.. ఆడడం పూర్తయ్యాక పక్కనే ఉన్న డ్యాంలో స్నానం చేయడానికి వచ్చారు.. వారం క్రితం కురిసిన భారి వర్షాలతో డ్యాంలో నీటి మట్టం ఎక్కువగా ఉంది… వాళ్లు స్నానానికి వచ్చినప్పుడు అక్కడికి దగ్గరలో బట్టలుతుకుతున్నారు సెంటామిజ్ సెల్వి (38), ముత్తమల్ (34), అనంతవల్లి (34)…వీళ్లు ఈతకు వచ్చేటప్పటికి వాళ్ల పనైపోయి వెళ్లిపోవడానికి సిద్దమవుతున్నారు..
Advertisement
“ ఆనకట్టలో ఈత కొట్టడం గురించి అడిగితే . నీరు లోతుగా ఉండవచ్చని హెచ్చరించారు, అయినప్పటికి నలుగురు యువకులు ఈత కొట్టడానికి అందులోకి దిగారు.. పట్టుకోల్పోయి మునిగిపోతూ..కాపాడండి, రక్షించండి అంటూ అరుపులు,కేకలు.. ఒక్క క్షణం పాటు ఏం జరుగుతుందో ఆ ముగ్గురికి అర్దం కాలేదు..రెప్పపాటులో వారి ముగ్గురిలో వచ్చిన ఆలోచనని వెంటనే అమలు చేసి ఇద్దరి ప్రాణాలు కాపాడగలిగారు..మరో ఇద్దరిని రక్షించడానికి ఎంత ప్రయత్నించిన చనిపోయినట్టుగా గుర్తించారు..
మనదేశంలో ఆడవాళ్లు ప్రాణాలకంటే మానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిన విషయమే..అటువంటిది ఆ క్షణంలో పిల్లల ప్రాణాలు కాపాడడం తప్ప వారికి మరో ఆలోచన లేదు..వెంటనే వారి ముగ్గురు చీరలను విప్పి ముడి వేసి ఒక తాడులా చేసి ఆనకట్టలోకి విసిరేసారు.. దాన్నందుకున్న కార్తిక్ ,సెంతివేలన్ లను అతి కష్టం మీద ఒడ్డుకి లాగగలిగారు..పవిత్రన్ ,రంజిత్ అనే మరో ఇద్దరిని రక్షించలేకపోయారు..నెటిజన్లు ముగ్గురు మహిళల్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు..రియల్లీ హ్యాట్సాప్..!
Advertisements
Advertisements