Advertisement
భారతీయులు అంటేనే నిజంగా ఎందుకో ప్రపంచంలోని ఇతర దేశాలకు గిట్టదు. మనవాళ్లు అనేక అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. అనేక విషయాలను కనిపెట్టారు. అయినప్పటికీ విదేశీ సైంటిస్టులతో పోలిస్తే మన సైంటిస్టులకు దక్కే గౌరవం చాలా తక్కువ. పూర్వకాలంలోనే మనవాళ్లు సున్నా (0)ను, చదరంగాన్ని కనిపెట్టారు. ప్రపంచమంతా ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తుంది. అయితే ఇవే కాదు, మన భారతీయులు పలువురు ఇంకా కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. కానీ వాటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అందువల్ల అవి మరుగున పడిపోయాయి. అలాంటి అద్భుతమైన ఆవిష్కరణలలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్లాస్టిక్ రోడ్స్:
మన దేశంలో నిత్యం ఎన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయో తెలిసిందే. ప్లాస్టిక్ భూతం పర్యావరణానికే కాదు, సమస్త మానవాళికి శనిలా దాపురించింది. అయితే ప్లాస్టిక్‌తో రోడ్లను వేస్తే పర్యావరణానికి ఎంతగానో మేలు కలుగుతుందని, అలాగే ప్రజలకు ఎక్కువ కాలం మన్నే నాణ్యమైన రోడ్లను అందించవచ్చని డాక్టర్ ఆర్. వాసుదేవన్ అనే సైంటిస్టు గుర్తించారు. అందులో భాగంగానే ఆయన ప్లాస్టిక్ రోడ్లకు 2006లో పేటెంట్ కూడా తీసుకున్నారు. కంకరకు ప్లాస్టిక్ కోటింగ్ వేసి తరువాత వాటితో రోడ్డు వేశాక వాటిపై ప్లాస్టిక్‌ను కరిగించి పోస్తే ఆ రోడ్లు ఎక్కువ కాలం పాటు ఉంటాయని ఆయన చెప్పారు. అయితే ఆయన మోడల్‌ను ఇప్పటికీ ఎవరూ అనుసరించకపోవడం విచారకరం.
2. పేపర్ మైక్రోస్కోప్:
Advertisements
Advertisement
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన మను ప్రకాష్ అనే యువ సైంటిస్టు పేపర్ ద్వారా మైక్రోస్కోప్‌ను రూపొందించాడు. దానికి ఫోల్డ్ స్కోప్ అని పేరు పెట్టాడు. సింగిల్ షీట్‌పై ప్రింట్ చేసిన అనంతరం పేపర్‌ను ఫోల్డ్ చేసి ఈ స్కోప్‌ను తయారు చేయవచ్చు. కానీ ఈ ఆవిష్కరణ గురించి ఎవరికీ తెలియదు.
3. బాటిల్ క్యాప్ ఫిల్టర్:
Advertisements
నిరంజన్ కరగి అనే వ్యక్తి బాటల్ క్యాప్ సహాయంతో నానో టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి ఫిల్టర్ ను తయారు చేశాడు. ఆ ఫిల్టర్ బాటిల్ క్యాప్‌కు ఉంటుంది. ఆ క్యాప్‌ను బాటిల్‌కు పెట్టి బాటిల్‌లో ఉన్న అపరిశుభ్రమైన నీటిని క్షణాల్లోనే 99.99 శాతం వరకు ఫిల్టర్ చేయవచ్చు. ఈ ఆవిష్కరణ గురించి కూడా చాలా మందికి తెలియదు.
4. కార్బరైజ్డ్ స్టీల్:
భారతీయులకు పురాతన కాలం నుంచే లోహాలపై అవగాహన ఉంది. లోహ శాస్త్రం గురించి మన వాళ్లకు బాగా తెలుసు. ఎంతో పురాతన కాలం నుంచే స్టీల్‌ను తయారు చేసి ఉపయోగించడం నేర్చుకున్నారు. ప్రస్తుతం స్టీల్ తయారీలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాలన్నీ పురాతన భారతీయులకు చెందినవే కావడం విశేషం.
ఇలా అనేక ఆవిష్కరణలను భారతీయులు చేసినప్పటికీ మనకు సరైన ఆదరణ లభించలేదన్నమాట వాస్తవం.