Advertisement
బాలీవుడ్ నటీనటులకు, టీమిండియా క్రికెటర్లకు చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. సాధారణంగా మనం కొందరిని చూస్తే మనకు తెలిసిన ఎవరినో చూసినట్లు అనిపిస్తుంది. అచ్చం మనకు తెలిసిన వారు ప్రవర్తించినట్లుగానే కొందరు మనకు బయట ప్రవర్తిస్తూ కనిపిస్తారు. ఇక క్రికెటర్లను, బాలీవుడ్ నటీనటులను తీసుకున్నా.. కొందరికి కొన్ని పోలికలు ఉంటాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే..
1. పార్థివ్ పటేల్, అనిల్ కపూర్
ఇద్దరూ యువకుల్లాగే కనిపిస్తారు. వీరికి వయస్సు మీద పడుతున్నట్లు కనిపించదు.
2. హార్దిక్ పాండ్యా, కంగనా రనౌత్
Advertisements
ఇద్దరూ చాలా టాలెంటెడ్. కానీ టీవీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తే మాత్రం వివాదాలు వస్తుంటాయి.
3. స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ బచ్చన్
ఇద్దరూ తమ తండ్రులు, అందమైన భార్యల వల్ల ఫేమస్ అయ్యారు.
4. మురళీ విజయ్, శ్రీదేవి
ఇతరుల లైఫ్ పార్ట్‌నర్‌లను వివాహం చేసుకోవడంతో పేరుగాంచారు.
5. అజారుద్దీన్, సంజయ్‌దత్
అండర్ వరల్డ్, మాఫియాతో ఉన్న సంబంధాల కారణంగా ఇద్దరూ తమ తమ కెరీర్లను నాశనం చేసుకున్నారు. అలాగే ఇద్దరి బయోపిక్‌లను తీశారు.
Advertisement
6. సచిన్, షారూక్ ఖాన్
ఒకరేమో బెస్ట్ క్రికెటర్. మరొకరేమో బెస్ట్ ప్లేయర్. వీరిద్దరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులు. సచిన్ ఖాతాలో ట్రిపుల్ హండ్రెడ్ లేదు. అలాగే షారూక్ ఖాతాలో రూ.300 కోట్ల మూవీ లేదు. కానీ ఇద్దరూ పేరుగాంచారు.
7. రాహుల్ ద్రావిడ్, అమీర్ ఖాన్
ఇద్దరూ క్లాస్‌కు, పర్‌ఫెక్షన్‌కు పేరు గాంచారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో పర్‌ఫెక్ట్‌గా గుర్తింపు పొందారు.
8. దినేష్ కార్తీక్, విక్రాంత్ మాసే
ఇద్దరూ తమ తమ రంగాల్లో జెమ్స్. కానీ వీరిద్దరూ తగినంత గుర్తింపును పొందలేకపోయారు.
9. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్‌ఖాన్
ఇద్దరూ టాలెంటెడ్. కానీ తక్కువ గుర్తింపు లభించింది. ఒకరు క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. మరొకరు పోరాడుతున్నారు. అయినప్పటికీ క్యాన్సర్ వారి ప్రతిభకు, ప్రదర్శనకు అడ్డు కాలేదు.
10. అర్జున్ టెండుల్కర్ (సచిన్ కుమారుడు), ఆర్యన్ ఖాన్ (షారూక్ కుమారుడు)
Advertisements
ఇద్దరూ ఇంకా ఆయా రంగాల్లో రంగ ప్రవేశం చేయలేదు. కానీ వస్తే అందరి కళ్లూ వీరిద్దరిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం నెపోటిజంపై దుమారం చెలరేగుతోంది కదా. కనుక వీరిద్దరూ వస్తే అప్పుడు వీరి తండ్రులపై విమర్శలు వస్తాయి. మరది జరుగుతుందా, లేదా చూడాలి.