Advertisement
ఎన్ని తరాలు మారినా.. ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా.. మనుషులు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ను అనుసరిస్తుంటారు. ముఖం, శిరోజాలు, చర్మం తదితర భాగాలను సంరక్షించుకునేందుకు, అందంగా కనిపించేందుకు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఒకప్పుడు అందం కోసం కొందరు ఎలాంటి వింతైన పద్ధతులను పాటించేవారో తెలుసా..? వాటిని తెలుసుకుంటే మీరు షాకవుతారు..
సొట్ట బుగ్గలను ఏర్పాటు చేసే మెషిన్:
సొట్ట బుగ్గలు ఉన్నవారు నవ్వితే అందంగా ఉంటారు. అలాంటి వారి పట్ల ఇతరులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అయితే సొట్ట బుగ్గలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని కృత్రిమంగా సృష్టించలేం. కానీ 1936లో న్యూ యార్క్ సిటీలో ఇసాబెల్లా గిల్‌బర్ట్ సొట్టబుగ్గలను సృష్టించే మెషిన్‌ను రూపొదించింది. ఆ మెషిన్‌కు ఉంఏ రెండు తీగల వంటి నిర్మాణాలను బుగ్గలపై కొంత సేపు ఒత్తి పట్టి ఉంచుతారు. దీంతో సొట్ట బుగ్గలు ఏర్పడేవి. అయితే అవి సహజంగా వచ్చిన సొట్టబుగ్గల్లా ఉండకపోయేవి.
డర్టీ విగ్స్:
Advertisements
17వ శతాబ్దంలో కింగ్ లూయీస్-14 బట్టతలను కప్పి ఉంచేందుకు విగ్ ధరించేవాడు. అయితే ఆ విగ్‌ను ఉతకకపోవడంతో అది అత్యంత మురికిగా ఉండేది. కానీ పౌడర్, పెర్‌ఫ్యూమ్ కొట్టి దాన్ని సువాసన వచ్చేలా మార్చేవారు. అయితే అదే పద్ధతిలో అప్పట్లో బట్టతల ఉండేవారు డర్టీ విగ్స్ ను ధరించేవారు. తమ బట్టతలను కప్పి ఉంచేందుకు ఎంత మురికి అయిన విగ్‌ను అయినా ధరించేందుకు అప్పట్లో పురుషులు వెనుకాడేవారు కాదు.
బ్లూ బ్లడ్ వెస్సల్స్:
Advertisement
17వ శతాబ్దంలో యూరప్‌లో ధనిక మహిళలు తమ ఛాతి, భుజాలు, మెడ భాగాల్లో ఉండే రక్తనాళాలపై చర్మం మీద బ్లూ పెన్‌తో గీతలు గీసే వారు. తాము ఉన్నత వర్గాలకు చెందిన వారమని తెలియజేసేందుకు వారు అలా చేసేవారు.
బ్లిజర్డ్ కోన్:
1939లో మాంట్రియాల్‌లో మంచు తుపాన్లు విపరీతంగా వచ్చి ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో కొందరు తమ ముఖాలను రక్షించుకునేందుకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన కోన్ ఆకారంలో ఉండే మాస్క్ లను ముఖాలపై ధరించేవారు. అప్పట్లో ఇది ఫ్యాషన్‌గా ఉండేది.
ఫుట్ బైండింగ్:
చైనాలో పూర్వకాలంలో మహిళల అరికాళ్లను విరగ్గొట్టేవారు. దీంతో పాదాలు పెరగకుండా అడ్డుకునేవారు. ఫలితంగా పాదాలను 3 ఇంచుల గోల్డెన్ ఫీట్ అని పిలిచేవారు. దీని వల్ల ఆ మహిళల వివాహాలపై కూడా ప్రభావం పడేది.
ఎక్స్-రేలు:
Advertisements
లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా ప్రస్తుతం అవాంఛిత రోమాలను తొలగిస్తున్నారు. కానీ 1895లో విల్‌హెల్మ్ రాంట్‌జెన్ ఎక్స్-రే మెషిన్‌ను ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించే టెక్నిక్ కనిపెట్టాడు. దీంతో చాలా మంది అతని వద్దకు అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు వెళ్లేవారు. ఎక్స్-రే మెషిన్‌తో 12 రోజుల పాటు మొత్తం 20 గంటలు చికిత్స చేసేవాడు. ఫలితంగా వెంట్రుకలు రాలిపోయేవి. అయితే ఎక్స్-రే మెషిన్ ను అన్ని గంటల పాటు వాడడం వల్ల ప్రాణాలకు ప్రమాదం కలిగేది. కొందరు చనిపోయారు కూడా. అందువల్ల ఈ పద్ధతిని అప్పట్లోనే నిలిపివేశారు.