Advertisement
హైదరాబాద్ అనగానే మనకు ముందుగా ఇక్కడి బిర్యానీ రుచులు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా కూడా పేరుంది. అందుకనే చాలా మంది విదేశీయులు కూడా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా ఇక్కడి బిర్యానీని రుచి చూస్తారు. అయితే హైదరాబాద్ లో కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. ఇంకా పలు ఇతర ఆహార పదార్థాలు కూడా చక్కని రుచులను అందిస్తాయి. అవేమిటంటే.
1. హలీం:
హైదరాబాద్‌లో బిర్యానీ కాకుండా ముఖ్యమైన ఆహారాల్లో హలీం కూడా ఒకటి. రంజాన్ సీజన్‌లో హలీం ఎక్కువగా లభిస్తుంది. అలాగే పలువురు శుభ కార్యాల సమయంలో హలీంను వండి అతిథులకు వడ్డిస్తారు. మాంసం, గోధుమపిండి, మసాలాలు, పప్పు దినుసులు వేసి వండే హలీం ఎంతో రుచికరంగా ఉంటుంది. హైదరాబాద్ హలీంకు కూడా మంచి పేరు ఉంది.
2. లుఖ్మి:
Advertisements
చూసేందుకు ఇది బేకరీల్లో అమ్మే వెజ్ పఫ్‌ను పోలి ఉంటుంది. దీన్ని మైదా పిండితో తయారు చేస్తారు. లోపల ఖీమా చేయబడి వండబడిన మాంసం ఉంటుంది. ఇది బయటకు క్రిస్పీగా లోపల స్పైసీగా ఉంటుంది. దీన్ని కూడా శుభకార్యాలు, వేడుకల్లో వడ్డిస్తారు. హైదరాబాద్‌లో ఈ వంటకమూ ఫేమస్సే.
3. పత్తర్ కా గోష్త్:
నిజాం అసాఫ్ జా VI కు అప్పట్లో ఇది ఇష్టమైన వంటకంగా ఉండేది. దీన్ని మేక మాంసంతో తయారు చేస్తారు. దానిపై ఉల్లిపాయలు, ఇతర పదార్థాలు వేసి వడ్డిస్తారు. ఎంతో రుచికరంగా ఉంటుంది. హైదరాబాద్‌లో చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. అందువల్ల ఇది కూడా ఈ నగరంలో ముఖ్యమైన వంటకంగా చెప్పవచ్చు.
4. జౌజి హల్వా:
Advertisement
నెయ్యి, మొలకెత్తిన గోధుమల పిండి, కుంకుమ పువ్వు, మసాలాలు, నట్స్ తదితర పదార్థాలను వేసి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. టర్కీలో ఈ వంటకాన్ని ఎక్కువగా వండుతారు. అయినప్పటికీ హైదరాబాద్‌లోనూ ఈ వంటకం మనకు లభిస్తుంది.
5. తలా హువా గోష్త్:
మటన్, ఉల్లిపాయలు, మసాలాలు వేసి దీన్ని తయారు చేస్తారు. దీన్ని సాధారణంగా అన్నంతో తింటారు. దీన్ని కొందరు తలావా గోష్త్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌లో మనకు లభించే ముఖ్యమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి.
6. మరగ్:
నిజానికి ఇది మటన్ సూప్. దీన్ని భోజనానికి ముందు స్టార్టర్ డిష్ కింద వడ్డిస్తారు. ఎముకలతో ఉన్న మటన్ ముక్కలను వేసి దీన్ని తయారు చేస్తారు. ఇందులో ఉల్లిపాయలు, జీడిపప్పు, పెరుగు, కొబ్బరిపొడి, పాలు తదితర పదార్థాలను కూడా వేస్తారు. అందువల్ల టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని పెళ్లిళ్ల సమయంలో విందుల్లో ఎక్కువగా వడ్డిస్తారు.
7. కుబానీ కా మీఠా:
హైదరాబాద్‌లో చాలా మంది పెళ్లిళ్లలో విందులో దీన్ని డిజర్ట్‌గా వడ్డిస్తారు. హైదరాబాద్‌కు చెందిన ముఖ్యమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. బిర్యానీ కాకుండా దీన్ని కూడా చాలా మంది ఎక్కువగానే ఇష్టపడతారు. ఇందులో యాప్రికాట్స్ వేసి తయారు చేస్తారు. అందువల్ల చక్కని రుచి వస్తుంది.
Advertisements