Advertisement
పిల్లలు పుట్టడం సహజం, కవలలు పుట్టడం అరుదు….అదే కవలలు సెలెబ్రిటీలకు పుడితే చర్చకు వచ్చే అంశం….ఉదయభానుకు కవలలు పుట్టాక ఈ చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో కవలలకు జన్మనిచ్చిన వారెవరో చూద్దాం!
మంచు విష్ణు:
2009 విరోనిక ను పెళ్ళి చేసుకున్న మంచు విష్ణుకు… 2011 లో అరియానా, వివియానా అని ఇద్దరు కవల అమ్మాయిలు పుట్టారు!
సంజయ్ దత్:
మాన్యతా దత్ ని 2008లో మూడో వివాహం చేసుకున్న సంజయ్ దత్ కు 2010లో కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి. అబ్బాయికి షాహరాన్ అని అమ్మాయికి ఇక్రాన్ అనే పేర్లు పెట్టారు.
Advertisements
ఉదయ భాను:
విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న ఉదయభానుకు 2016 లో కవలలు పుట్టారు ( ఇద్దరమ్మాయిలు). వీరికి యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టారు.
భరత్:
ప్రేమిస్తే ఫేమ్ భరత్ 2013 లో చిన్నప్పటి ఫ్రెండ్ జెస్లీ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో కవలలు పుట్టారు ( ఇద్దరబ్బాయిలు) వీరి పేర్లు ఆద్యన్, జేన్
Advertisement
సన్నీ లియోన్:
పోర్న్ స్టార్….సన్నీ లియోన్ 2011 లో డానియల్ వెబర్ ను పెళ్లి చేసుకున్నారు.. పిల్లలు కాట్లేదని ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2017 లో వీరికి కవలలు పుట్టారు ( ఇద్దరబ్బాయిలు ) వారి పేర్లు అషర్ ,నోహా
కరణ్ జోహార్:
బాలీవుడ్ దర్శక నిర్మాత మరియు హోస్ట్ కరణ్ జోహార్ కి 2017లో ఇద్దరు కవలలు( అమ్మాయి, అబ్బాయి) పుట్టారు . వీరి పేర్లు రూహి , యష్! కరణ్ జోహార్ అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నట్టు సమాచారం!
ఫరా ఖాన్:
బాలీవుడ్ మహిళా దర్శకురాలైన ఫరా ఖాన్ 2004లో డాన్స్ మాస్టర్ శిరీష్ కుందర్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి కవలలు పుట్టారు ( ఇద్దరమ్మాయిలు). వీరి పేర్లు దివ ,అన్య
సెలీనా జెట్లీ:
సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సెలీనా జైట్లో…. ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ 2012 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.! వీరికి 2017లో కవలలు (ఇద్దరబ్బాయిలు) పుట్టారు. వీరి పేర్లు ఆర్థర్ హాగ్, షంషేర్ హాగ్
Advertisements