Advertisement
గతంలో కేవలం తెరముందు కనిపించే నటులకు మాత్రమే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది . కానీ ప్రస్తుతం తెర వెనకాల ఉండి సినిమాని నడిపించే డైరెక్టర్స్ కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది . దాంతో కొన్ని కొన్ని సార్లు వారు కూడా కెమెరా ముందుకు వచ్చి వారి సినిమాల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు . అలా వారి సినిమాల్లో కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్స్ , వారు కనిపించిన సినిమాలు గురించి చూద్దాం!
1. పూరీ జగన్నాథ్
పూరి జగన్నాథ్ ….. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ డైరెక్టర్ . ఇతను మహేష్ బాబు తో చేసిన బిజినెస్ మ్యాన్ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్ గా వచ్చి హీరోయిన్ ని కిడ్నప్ చేస్తాడు . అలాగే ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమాలో కూడా బైక్ పై కనిపిస్తాడు . అంతేకాదు ఈ మధ్య కాలంలో వచ్చి సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ఒక పాటలో కనిపించాడు పూరి .
2. శేఖర్ కమ్ముల
Advertisements
అద్భుతమైన విభిన్న కథలు తీసే శేఖర్ కమ్ములకు కూడా స్టూడెంట్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది . ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించారు . అలాగే రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలో కూడా కనిపించాడు
3. రాజమౌళి
హీరోల స్టార్ హోదాతో సంబంధం లేకుండా కేవలం తన పేరుతోనే సినిమాని హిట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఈయన మొదటి సారిగా నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాలో కనిపించాడు . తర్వాత ఆయన తీసిన బాహుబలి 2 లో ఒక కళ్ళు అమ్మే వాడిలా కనిపించాడు.
4. వివి వినాయక్
మాస్ సెన్సేషనల్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన మొదటి సారి చిరంజీవి హీరోగా చేసిన ఠాగూర్ సినిమాలో చిరంజీవి స్టూడెంట్ గా నటించాడు . చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి తో చేసిన ఖైదీ నెం 150 లో కూడా కనిపించారు . ఇప్పుడు ఏకంగా ఆయనే హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది!
Advertisement
5. శ్రీకాంత్ అడ్డాల
ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తన దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో కనిపించారు. తర్వాత మళ్ళీ మహేష్ బాబు తో చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా కనిపించారు .
6. క్రిష్
దర్శకుడు క్రిష్ తను దర్శకత్వం వహించిన వేదం సినిమాలో స్వామీజీ గెటప్ లో కనిపించి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.
7. శ్రీనువైట్ల
మంచి కామిడి టైమింగ్ తో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసే శ్రీను వైట్ల కూడా తన దర్శకత్వంలో వచ్చిన దుబాయ్ శ్రీను సినిమాలో తెరపై కనిపించాడు .
8. సురేందర్ రెడ్డి
సూపర్ హిట్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రవితేజతో చేసిన కిక్2 లో తెరపై కనిపించాడు.
9. సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ అదే సినిమాలో కనిపించాడు.
10. ఓంకార్
తన డైరెక్షన్లో వచ్చిన రాజుగారి గది తో సూపర్ హిట్ కొట్టిన , యాంకర్ అండ్ డైరెక్టర్ ఓంకార్ .. తను చేసిన రాజుగారి గది లో తెరపై కనిపించారు.
Advertisements