Advertisement
వారసత్వం ….. యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్.! ఇదే బాటలో మ్యూజిక్ డైరెక్టర్ల కొడుకులు కూడా పయనిస్తున్నారు. చిన్నప్పుడే తండ్రి దగ్గరి నుండి సంగీత ఓనమాలు నేర్చుకొని వాటికి ఇంకాస్త వెస్ట్రన్ సొగబులు అద్ది తమదైన స్టైల్లో ఈ రంగంలో రాణిస్తున్నారు సంగీత దర్శకుల కొడుకులు. అలా తండ్రి తర్వాత సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లుగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ల గురించి తెలుసుకుందాం.
1. కోటి – రోషన్:
90 లో దాదాపు ప్రతి సినిమాకు మ్యూజిక్ అందించిన జంట రాజ్ – కోటి.! తర్వాత కోటి సింగిల్ గా కూడా చాలా సినిమాలకు మ్యూజిక్ ను అందించారు. కోటి తండ్రి రాజేశ్వర్రావ్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే ! ఆయన తెలుగు , తమిళ్ కలిపి 50 సినిమాలకు పైన సంగీతం అందించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించిన కోటి అనేక సినిమాలకు మ్యూజిక్ ను అందించి సినిమాలను హిట్ చేశాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు రోషన్ కూడా అదే బాటలో కంటిన్యూ అవుతున్నాడు నిర్మలా కాన్వెంట్ సినిమాకు రోషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారించాడు.
Advertisement
2. మణిశర్మ – స్వర సాగర్ మహతి:
Advertisements
1992 లో రాత్రి సినిమాతో టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మణి శర్మ. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు…ఎన్నో హిట్ ఆల్బమ్స్ ను ఇచ్చాడు. ఆయన కుమారుడు స్వర సాగర్ మహతి కూడా తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.
చలో, భీష్మ సినిమాలకు సంగీతం అందించాడు సాగర్.
3. కీరవాణి – కాల భైరవ:
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి కుమారుడు కాల భైరవ కూడా టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు . కాల భైరవ ఇప్పటివరకు మత్తు వదలరా , కలర్ ఫోటో వంటి సినిమాలు సంగీతం అందించాడు.
Advertisements