Advertisement
డాక్టర్ అంటే శరీరానికి ప్రాణం పోసే వారు యాక్టర్స్ అంటే పాత్రలకు ప్రాణం పోసే వారు, బాగా ఆలోచిస్తే రెండు ఒకేలా అనిపిస్తాయి . మనం చాలా సార్లు వింటుంటాము… నేను యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాను అని చాలా మంది అంటుంటారు! అలాగే డాక్టర్ చదువు చదివి నటులు అయినవారు చాలా మందే ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
అల్లు రామలింగయ్య :
ప్రముఖ హస్య నటుడు అల్లు రామలింగయ్యకు పెద్దగా చదువు అబ్బలేదు…తన కుటుంబాన్ని పోషించడానికి హోమియోపతి వైద్యం నేర్చుకొని వైద్యం చేసేవారు. అలాగే డాక్టర్ అల్లు రామలింగయ్యగా పేరు పొందారు. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన పేర రాజమండ్రిలో కాలేజీ కూడా ఉంది. ఈయన చిరంజీవికి స్వయాన పిల్లనిచ్చిన మామ.
సాయి పల్లవి:
హైబ్రీడ్ పిల్లా అంటూ ఫిదా సినిమాతో ఎంతోమంది మనసు దోచేసిన , సాయి పల్లవి ఒకప్పుడు ఢీ డాన్స్ షోలో మంచి డాన్సర్ గా పేరు సంపాదించి తర్వాత హీరోయిన్ సినిమాల్లోకి రంగప్రవేశం చేసింది , మొదట జార్జియాలో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన పల్లవి తర్వాత సినీ రంగంలోనే ఉండిపోయింది.
Advertisements
రాజశేఖర్:
Advertisement
వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్… ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో వచ్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.
సౌందర్య:
స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య కూడా ఎంబిబిఎస్ మధ్యలో ఆపేసి నటిగా కొనసాగింది. హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్నప్పుడే విమాన ప్రమాదంలో మరణించింది.
భరత్ రెడ్డి:
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుడు భరత్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
ప్రణీత :
బావ సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన బాపుగారి బొమ్మ ప్రణీత కూడా వైద్యురాలే .. సినిమాల్లో బిజీ గా ఉంటూనే ఖాలీ సమయంలో తన సొంత క్లినిక్ లో వైద్యం చేస్తూ ఉంటుంది .
Advertisements
రంగం విలన్ అజ్మల్ అమీర్, వెటరన్ యాక్టర్ ప్రభాకర్ లు కూడా డాక్టర్లే!