Advertisement
బావా- మరదళ్లు…భార్యాభర్తలుగా మారిన సందర్భాలు అనేకం.! అప్పట్లో నా కొడుకుకు నీ కూతురంటూ చిన్నప్పుడే సంబంధం ఫిక్స్ అయిపోయేది! పెళ్లి చేయాలంటే ఫస్ట్ అయినోళ్లు ఎవరైనా ఉన్నారా? అని చూసుకున్నాకే బయటి సంబంధాల వైపు చూసేవారు. అలా మన టాప్ హీరోల్లో…. తమ సొంత మరదళ్లనే చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఈ లిస్ట్ లో వెటరన్ హీరోస్ యే ఎక్కువగా ఉన్నారు.! వాళ్లెవరో చూద్దాం!
NTR – బసవ తారకం:
NTR తన సొంత మరదలైన బసవతారకాన్ని 1942 లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి NTR ఇంకా సినిమాల్లోకి రాలేదు.
ANR- అన్నపూర్ణ:
ANR కూడా తన సొంత మరదలైన అన్నపూర్ణను 1949లో వివాహం చేసుకున్నారు. ANR అప్పటికే దాదాపు 10 సినిమాల్లో నటించారు.
Advertisements
కృష్ణ-ఇందిరాదేవి:
కృష్ణ కూడా తన మరదలైన ఇందిరాదేవిని 1961లో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత కృష్ణ హీరోగా తొలి సినిమా విడుదలైంది
Advertisement
మోహన్ బాబు-విద్యా దేవి&నిర్మలా దేవి :
సీనియర్ హీరోల మాదిరిగానే మోహన్ బాబు కూడా తన మరదలైన విద్యా దేవిని పెళ్లిచేసుకున్నారు. ఆమె హఠాన్మరణం తరువాత ఆమె సొంత చెల్లెలైన నిర్మలా దేవిని పెళ్లి చేసుకున్నారు.
ఆది –అరుణ :
సాయికుమార్ వారసుడైన ఆది కూడా తన మరదలినే పెళ్లి చేసుకున్నాడు. అండర్ 19 క్రికెట్ ఆడిన ఆది…తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు….2014లో తన మేనమామ కూతురైన అరుణను వివాహం చేసుకున్నాడు.
కార్తీ-రజిని:
సూర్య తమ్ముడైన కార్తీ కూడా తన మరదలైన రజిని ని 2011 లో పెళ్లి చేసుకున్నాడు.
Advertisements