Advertisement
సాధారణంగా ఇనుప వస్తువులు గాలిలో ఉంటే కొంత కాలానికి అవి తుప్పు పడతాయి. ఆ వస్తువుల పైభాగంలో తుప్పు వచ్చి చేరుతుంది. తరువాత కొన్ని రోజులకు వస్తువులు ఆ తుప్పుకు విరిగిపోతాయి. అయితే ఇనుప లోహంతో తయారు చేయబడినప్పటికీ ఆ వస్తువు మాత్రం ఇప్పటికీ ఇంకా తుప్పు పట్టలేదు. ఇంకా చెప్పాలంటే.. దాన్ని తయారు చేసి సుమారుగా 1600 ఏళ్లు అవుతోంది. అయినా ఇంకా అది చెక్కు చెదరలేదు. ఏంటీ.. నమ్మలేకుండా ఉన్నారా..? అయినా ఇది నిజమే. ఇంతకీ ఆ వస్తువు ఏమిటా.. అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ.. ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్..!
ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్‌లో ఓ ఇనుప స్తంభం ఉంది. దాన్ని చాలా మంది గమనించే ఉంటారు. దాని ఎత్తు సుమారుగా 7 మీటర్లు ఉంటుంది. బరువు దాదాపుగా 6వేల కిలోల వరకు ఉంటుంది. దాన్ని రెండో చంద్రగుప్తుడి కాలంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఆ స్తంభాన్ని 1600 ఏళ్ల కిందట తయారు చేశారట. అయినప్పటికీ ఆ ఇనుప స్తంభానికి ఇంకా తుప్పు పట్టలేదు. దీంతో ఆ స్తంభాన్ని చూసే చాలా మంది ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతూనే ఉంటారు.
Advertisement
ఆ స్తంభం ఇనుపదే అయినా.. అన్ని వందల ఏళ్లు గడిచినా.. ఇంకా అలా తుప్పు పట్టకుండా ఎందుకు ఉంది ? అనే విషయంపై ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బాలసుబ్రమణియం రీసెర్చి చేశారు. చివరకు తేలిందేమిటంటే.. ఆ స్తంభంలో ఇనుముతోపాటు ఫాస్ఫరస్ కూడా ఎక్కువగానే ఉందని గుర్తించారు. అందువల్లే ఆ స్తంభం ఇంకా అలాగే తుప్పు పట్టకుండా ఉందట. ఫాస్ఫరస్ ఆ స్తంభం పై భాగంలో రక్షణ పొరగా ఉందట. అందుకనే ఆ స్తంభం ఇప్పటికీ తుప్పు పట్టలేదని తెలిపారు. అయితే అప్పట్లోనే ఈ విషయం గురించి మన పూర్వీకులకు తెలియడం నిజంగా గొప్ప విషయమే. ఫాస్ఫరస్‌ను వాడితే ఇనుము తుప్పు పట్టకుండా ఉంటుందని వారు అప్పట్లోనే గుర్తించడం నిజంగా వారి గొప్పతనమే. సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు లేని ఆ రోజుల్లో వారు ఇలాంటి స్తంభాన్ని నిర్మించడం.. అదింకా తుప్పు పట్టకపోవడం.. నిజంగా ఇప్పటికీ మనకు నమ్మశక్యంగా లేదు కదా..!
Advertisements
Advertisements