Advertisement
ఉత్తరాది రాష్ట్రాలకు మిడతల బాధ ఇప్పుడప్పుడే తప్పేలా కనిపించడం లేదు. ఓ దశలో రెండు తెలుగు రాష్ట్రాల వైపు మిడతలు వచ్చినట్లే అనిపించాయి. కానీ అవి మళ్లీ అటువైపే తిరిగాయి. దీంతో ఆయా రాష్ట్రాల వారు మిడతల బాధ భరించలేకపోతున్నారు. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు గాను అధికారులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఓ రైతు తన పొలంలో మిడతలను తరిమేందుకు ఏర్పాటు చేసిన చిన్నపాటి విమానం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా ఎస్పీ రాహుల్ శ్రీవాత్సవ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ రైతు తన పొలంలో మిడతలను తరిమేందుకు ఏర్పాటు చేసిన చిన్నపాటి విమానానికి చెందిన వీడియో ఉంది. అయితే ఆ విమానాన్ని అతను ప్లాస్టిక్ డబ్బాలు, బ్లేడ్లను ఉపయోగించి తయారు చేయడం విశేషం. ఈ క్రమంలోనే ఆ విమానం పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
टिड्डी अविष्कार की जननी है !#Locust is the mother of inventions !#Jugad #Jugadrocks #TiddiAttack #Tiddi #LocustAttack #LocustSwarms #LocustInvasion #locustattacks #locusts pic.twitter.com/R3yuBEEUYm
Advertisement
— RAHUL SRIVASTAV (@upcoprahul) June 2, 2020
Advertisements
కాగా ఆ వీడియోకు ఇప్పటికే టిక్‌టాక్‌లో 27 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.5 మిలియన్ల లైక్‌లను ఆ వీడియో సాధించింది. అలా తనకు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి ఆ రైతు చిన్నపాటి విమానాన్ని తయారు చేయడం నిజంగా అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ఆ రైతు ప్రతిభను అందరూ మెచ్చుకుంటున్నారు. మిడతలను తరిమేందుకు అనేక మంది డీజేలు, ఇతర మ్యూజిక్ పరికరాలు, వంట పాత్రలను వాడుతుంటే.. ఆ రైతు మాత్రం ఇలా భిన్నంగా ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది
Also Read: రూట్ మార్చుకున్న మిడతలు, తెలుగు రాష్ట్రాలు సేఫ్.! ఇంతకీ మిడతలు రూట్ ఎందుకు మార్చుకున్నాయంటే…!
Advertisements
Also Read: గబ్బిలం అనగానే కొరోనా అంటున్నారు. అవే లేకుంటే అడుక్కు తినాల్సిందే.