Advertisement
మీకు ఎవరి మీదైనా విపరీతమైన కోపం.. కసి.. ద్వేషం.. ఉన్నాయనుకోండి.. ఏం చేస్తారు ? కొందరైతే భౌతికంగా దాడి చేసి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటారు. కొందరు మాటలు, చర్యల ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తన భార్యపై వెరైటీగా రివేంజ్ తీర్చుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
2015లో పంజాబ్‌కు చెందిన ఓ జంట విడాకులు కావాలని కోర్టుకెక్కింది. కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే భర్త తన భార్యకు నెలకు రూ.25వేలు భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ అతను డబ్బు ఇవ్వలేదు. దీంతో ఆమె ఈసారి హైకోర్టుకు వెళ్లింది. తన భర్త నుంచి నెల నెలా రూ.25వేలు భరణంగా ఇప్పించాలని కోరింది.
Advertisements
Advertisement
అయితే ఆ వ్యక్తి మాత్రం తనకు అంత సంపాదన లేదని, అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పాడు. అందుకు అతని భార్య స్పందిస్తూ.. తన భర్త పేరుగాంచిన లాయర్ అని, అతనికి ఎంతో మంది బిగ్‌షాట్స్ క్లయింట్లుగా ఉన్నారని, అలాగే అతనికి బోలెడన్ని స్థిర, చరాస్తులు ఉన్నాయని.. అతను అబద్ధం చెబుతున్నాడని.. కనుక తనకు ఎలాగైనా సదరు మొత్తాన్ని నెల నెలా భరణంగా ఇప్పించాలని ఆమె కోరింది. అయితే కోర్టు కూడా అది నిజమేనని నమ్మి అతన్ని తన భార్యకు రూ.25వేల భరణం నెల నెలా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు తమాషా చోటు చేసుకుంది.
Advertisements
ఆ వ్యక్తి సదరు రూ.25వేలు మొత్తంలో రూ.24,600లను చిల్లర నాణేల రూపంలో ఇచ్చాడు. అన్నీ రూ.1, రూ.2, రూ.5 నాణేల రూపంలో ఇచ్చాడు. మిగిలిన రూ.400కు గాను 4 100 నోట్లను ఇచ్చాడు. దీంతో అతని భార్య మళ్లీ కోర్టు ఎదుట వాపోయింది. తన భర్త అలా చిల్లర నాణేలను ఇచ్చి తనను వేధిస్తున్నాడని, ఇది అన్యాయమని, తనపై అతను ప్రతీకారం తీర్చుకుంటున్నాడని తెలిపింది. అందుకు అతను స్పందిస్తూ.. కోర్టు భరణం ఇవ్వాలని చెప్పింది.. అలాగే చట్టాల్లో ఎక్కడా రూ.100, రూ.500, రూ.2వేల నోట్ల రూపంలోనే భరణం చెల్లించాలని లేదని, నాణేల రూపంలో కూడా చెల్లించవచ్చని, అవి కూడా డబ్బులేనని అతను వాదించడంతో కోర్టు అతని వాదనతో ఏకీభవించింది. దీంతో ఆమె మొత్తాన్ని తీసుకోక తప్పలేదు. ఇదీ.. అసలు రివేంజ్ అంటే.. ఏమంటారు..?