Advertisement
సాధారణంగా మొక్కలు పెరగాలంటే మట్టి కావాలి. మట్టిలోనే మనం విత్తనాలు నాటుతాం. తరువాత మొలకలు వచ్చి మొక్కలు పెరుగుతాయి. అవి వృక్షాలుగా మారుతాయి. అయితే మట్టి లేకుండా మొక్కల్ని పెంచగలమా ? అలాంటి స్థితిలో అవి పెరుగుతాయా ? అంటే.. ఏంటి.. తమాషా చేస్తున్నారా..? మట్టి లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయి ? అనే సందేహం మీకు రావచ్చు. అయితే షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. గత కొంత కాలంగా మట్టి లేకుండానే మొక్కలను పెంచే ఓ నూతన విధానాన్ని పలువురు అనుసరిస్తున్నారు. అదేమిటంటే…
మట్టికి ప్రత్యామ్నాయంగా ఇసుక వేసి అందులో కంపోస్టు ఎరువు కలిపి మొక్కలు పెంచవచ్చు. అవును.. ఇది నిజమే. సాధారణంగా మట్టిలో పెరిగే మొక్కలకు చీడపీడలు, వ్యాధుల బెడద ఉంటుంది. కానీ మట్టి లేకుండా పెంచే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతోపాటు కంపోస్టు ఎరువును వేస్తారు కనుక.. అవి దిగుబడిని ఎక్కువగా ఇస్తాయి. అలాగే అవి పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతిలో పెరుగుతాయి కనుక వాటి పండ్లు లేదా ఆకులు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే మట్టి లేకుండా ఇసుకలో మొక్కలను ఎలా పెంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
మనకు సహజసిద్ధంగా లభించే ఇసుకనే మట్టికి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. దీన్ని సేకరించి నీటితో బాగా కడిగి శుభ్రం చేయాలి. అనంతరం అందులో వరి ధాన్యం పొట్టు, కొబ్బరి కాయ తీసేశాక మిగిలిన చెక్కలు, కలప పొట్టు, వేపాకులు, మన ఇండ్లలో నిత్యం ఉత్పత్తి అయ్యే కూరగాయల వ్యర్థాలు, జంతు వ్యర్థాలు (ఆవు పేడ మొదలైనవి) కలిపి ఇసుక, కంపోస్టు ఎరువు మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తరువాత దాన్ని కుండీల్లో పోసి అందులో విత్తనాలు నాటాలి. అనంతరం నీరు పోస్తుండాలి.
Advertisements
Advertisements
ఇక ఆయా పదార్థాల్లో ఉండే సహజమైన స్వభావం వల్ల మిశ్రమం లోపల విత్తనం మొలకెత్తాక వేర్లకు ఆ మిశ్రమం నుంచి పోషకాలు అందుతాయి. దీంతో మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పంట బాగా వస్తుంది. ఈ తరహా విధానం ద్వారా ఇండ్లలో తక్కువ స్థలం ఉన్నవారు కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. ఇక సహజసిద్ధంగా పండిస్తారు కనుక అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే విత్తనాలు నాటాక కుండీలలో నీరు ఏ మోతాదులో ఉందో సరిగ్గా చెక్ చేసుకోవాలి. అవసరం అయితే నీరు పోయాలి. నీరు ఎక్కువైతే ఆ మిశ్రమం కొంత కలపాలి. ఇలా మొక్కలను సులభంగా పెంచవచ్చు. ప్రస్తుతం ఈ విధానం ద్వారా చాలా మంది మొక్కలను పెంచుతున్నారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరి..!