Advertisement
బలహీనమైన వ్యక్తుల్ని అందరూ వాడుకోవాలని చూస్తారు..లేదంటే వాళ్లని చాలా ఈజిగా బోల్తాకొట్టించొచ్చని భావిస్తారు.. కానీ అందరూ అనుకున్నట్టే తను కూడా అనుకుంటే మనం ఈ కథ చెప్పుకునే అవసరం ఏముంటుంది.. ఎదుటి వ్యక్తి బలమేంటో తెలియ చేయాలి తప్ప, వారి బలహీనతలని మన అవకాశాలుగా మార్చుకోవద్దని చెప్పిన ఇవాన్ ఫెర్నాండెజ్ గురించి మనం తెలుసుకుని తీరాలి..
ఒకసారి రేసులో స్పెయిన్ కి చెందిన ఇవాన్ ఫెర్నాండెజ్ తో పాటు కెన్యా రన్నర్ అబెల్ ముతాయ్ పాల్గొన్నాడు.. పోటీ హోరాహోరిగా సాగుతుంది.. స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఇవాన్ ..ఇవాన్ అని అరుస్తున్నారు.. అయితే ఇవాన్ ని దాటుకుని అబెల్ ముతాయ్ వెళ్లిపోయాడు.. ఇవాన్ కి అర్దం అయిపోయింది ఈ రేస్ లో గెలుపు ముతాయ్ దే నని.. తీరా గమ్యస్థానానికి చేరుకున్నాక ఆల్రెడి తను రీచ్ అయ్యాననుకుని పరుగు ఆపాడు ముతాయ్..
Advertisement
అసలు కథ ఇక్కడ మొదలైంది.. వెనక ఉన్న ఇవాన్ స్పానిష్ లో అరుస్తున్నాడు.. అది కాదు గమ్యస్థానం ఇంకా ముందుకు వెళ్లాలి పరిగెత్తు, పరిగెత్తు అని అని.. ముతాయ్ కి స్పానిష్ అర్దం కాక …స్టేడియంలో వాళ్ల అరుపులతో మరింత గందరగోళానికి గురై సైలెంట్ అయిపోయాడు.. అతడిని చేరుకున్న ఇవాన్ ముతాయ్ ని విన్నింగ్ పాయింట్ దగ్గరకి ఒక్క తోపు తోసాడు..ముతాయ్ విజేతగా నిలిచాడు..
రేస్ ముగిసాక “మీరు ఎందుకు ఇలా చేసారు?మీరు కావాలని కెన్యాని గెలిపించారు” అని ఒక విలేకరి ఇవాన్‌ను అడిగాడు. ఇవాన్, “నేను అతన్ని గెలిపించలేదు..ఈ గెలుపు అతనిది.. ఈ రేస్ లో అతనే విజేత”అని సమాధానం ఇచ్చాడు.. రిపోర్టర్ పట్టుబట్టి మళ్ళీ అడిగాడు, “అయితే మీరే గెలిచారు!” ఇవాన్ అతని వైపు చూస్తూ ఇలా సమాధానం ఇచ్చాడు “చాలామంది బలహీనతల్ని బలోపేతం చేయకుండా ఉంటారు..కానీ నేనలా చేయాలనుకోలేదు..నేను అలా చేసుంటే నా విజయానికి యోగ్యత ఏమిటి? ఈ పతకానికి నేనిచ్చే గౌరవం ఏమిటి?? నా తల్లి నా గురించి ఏమనుకుంటుంది..??
Advertisements
“ విలువలు తరం నుండి తరానికి అందించబడుతుంటాయి..ఒకవేళ అతని బలహీనతని నేను వాడుకుని విజేతగా నిలబడి ఉంటే నా పిల్లలకు నేను ఏ విలువలు బోధిస్తాను..” ఈ పోటిలో అసలు విజేత ముతాయ్..అతన్ని నేను గెలిపించలేదు.. అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు..
Advertisements