Advertisement
సోడాలు.. శీతల పానీయాలు.. ఇవి మన ఆరోగ్యానికి హాని కలిగించేవి. వీటిల్లో సోడియంతోపాటు చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కిడ్నీల్లో ఏర్పడే స్టోన్లకు సోడియం, చక్కెరలు ప్రధాన కారణం. ఇవి ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి.
మనం తినే ఆహారాల్లో ఉండే మినరల్స్‌తోపాటు యాసిడ్ సాల్ట్స్ వల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడుతుంటాయి. అయితే సోడియం, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తింటే గనుక సమస్య మరింత ఎక్కువవుతుంది. కిడ్నీల్లో చేరే వ్యర్థ పదార్థాలు పెరిగిపోతాయి. ఫలితంగా వాటిల్లో స్టోన్స్ త్వరగా ఏర్పడుతాయి. అధిక సంఖ్యలో స్టోన్స్ చేరుతాయి. ఇది తీవ్ర సమస్యకు దారి తీస్తుంది.
Advertisement
Advertisements
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారిలో పొట్టకు రెండు వైపులా కింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కడుపులో మెలి తిప్పినట్లు అవుతుంది. ఆ నొప్పిని భరించలేరు. మూత్ర విసర్జన చేసే సమయంలోనూ తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అలాగే విపరీతమైన మంట ఉంటుంది. మూత్రం సరిగ్గా రాదు. కిడ్నీ స్టోన్స్ సమస్య రాకుండా ఉండాలంటే నిత్యం తీసుకునే ఆహారాల్లో సోడియం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తినకూడదు. వీటి వల్ల స్టోన్స్ ఏర్పడడమే కాదు, డయాబెటిస్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ రెండు పదార్థాలు ఉండే ఆహారాలను పూర్తిగా మానేస్తే మంచిది. లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కిడ్నీల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
Advertisements