Advertisement
మనలో అధికశాతం మందికి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని డ్రైవ్ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకనే చాలా మంది స్థోమత ఉన్నవారు అద్భుతమైన లగ్జరీ కార్లను, స్పోర్ట్స్ కార్లను కొంటుంటారు. అయితే నిజానికి ఆ కార్లు బాగానే ఉంటాయి. కానీ వాటిని భారత్‌లోని రోడ్లపై నడపలేం. అవును.. పలు కార్ల మోడల్స్‌ను పరిశీలిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది.
చిత్రంలో ఉన్న ఓ ఫెరారీ కారును చూడండి. దానికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత తక్కువగా ఉందో. అందువల్ల దాని ముందు భాగం దాదాపుగా స్పీడ్ బ్రేకర్‌కు టచ్ అవుతోంది. ఇలాంటి కార్లకు సహజంగానే వేగంగా వెళ్లేందుకు గ్రౌండ్ క్లియరెన్స్‌ను తక్కువగా ఇస్తారు. కానీ ఈ కార్లను మనం ఇండియాలో రోడ్లపై నడపలేం.
చాలా వరకు స్పోర్ట్స్ కార్లకు, లగ్జరీ కార్లకు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
Advertisements
Advertisement
- ఫెరారీ 458 ఇటాలియా కారుకు 113 ఎంఎం (4.4 ఇంచులు) గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.
- అదే లంబోర్గిని అవెంటాడర్‌కు 100 ఎంఎం (3.9 ఇంచులు),
- బుగాటి వెయ్‌రాన్ కు 90 ఎంఎం (3.6 ఇంచులు) గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.
కాగా మన దేశంలో ఓ సగటు స్పీడ్ బ్రేకర్ ఎత్తు దాదాపుగా 10 సెంటీమీటర్లు (3.94 ఇంచులు) ఉంటుంది. అందువల్ల ఆయా కార్లకు ఈ స్పీడ్ బ్రేకర్లు అడ్డు వస్తాయి. వాటి ముందు భాగం మొత్తం స్పీడ్ బ్రేకర్‌కు తగులుతుంది. అయినప్పటికీ కొందరు మాత్రం మన దేశంలో అలాంటి కార్లను ఉపయోగిస్తూనే ఉన్నారు.
Advertisements
అయితే మన దేశంలో నిజానికి అన్ని రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఒకే రకంగా ఉండవు. కొన్ని షార్ప్ బంప్‌లతో ఉంటాయి. కొన్ని స్మూత్ బంప్‌లతో ఉంటాయి. ఏ స్పీడ్ బ్రేకర్ అయినా సరే పైన చెప్పిన కార్లకు కచ్చితంగా అడ్డు వస్తుంది. కనుక మన దేశంలోని వారు ఆయా సూపర్ కార్లను కొని వాడాలనుకుంటే ముందుగా రోడ్ల పరిస్థితి తెలుసుకుంటే బెటర్. లేదంటే కారు కొనీ ప్రయోజనం ఉండదు.