Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పురాతన, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఒక్కో కట్టడం మనకు అనేక రకాల విషయాలను తెలియజేస్తుంది. వాటిని చూస్తే పర్యాటకులకు ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఎంతో కళాత్మకత ఉట్టి పడుతుంటుంది. అలాంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ నిర్మాణమే. దాన్నే కాజిర్ అల్‌ఫారిద్ (ది లోన్లీ క్యాజిల్) అని పిలుస్తారు.
ది లోన్లీ క్యాజిల్ సౌదీ అరేబియాలోని మౌట్ హోరెబ్ ప్రాంతంలో ఉన్న మదాఇన్ సలెహ్ లో ఉంది. అయితే క్యాజిల్ అన్నారు కదా.. అని దీన్ని కోట అనుకుంటే పొరపాటే. ఇది నిజానికి కోట కాదు. పురాతన అరబ్బులైన నబాటియన్లకు చెందిన సమాధి. దీన్ని ఒకే రాతి కొండపై చెక్కారు. కానీ చూసేందుకు అచ్చం కోటలాగే ఉంటుంది. కనుకనే దానికి చివర్లో క్యాజిల్ అని పేరు వచ్చింది. ఇందులో అనేక చిన్నపాటి గదుల లాంటి నిర్మాణాలు కూడా ఉంటాయి.
Advertisement
ఈ క్యాజిల్‌లో మొత్తం 130 సమాధులు ఉంటాయి. అన్నీ రాతిని కట్ చేసి నిర్మించినవే. అవి చూసేందుకు కోటలోని గదులను పోలి ఉంటాయి. అప్పట్లో ఈ నిర్మాణం మొత్తాన్ని ఒకే రాతిని చెక్కి నిర్మించారు. కానీ దాన్ని పూర్తి చేయలేదు. అందుకు కారణాలు కూడా తెలియదు. అందువల్ల సగ భాగం చెక్కబడి మనకు కోటలా కనిపిస్తుంది. మిగిలిన భాగం మొత్తం రాయి ఉంటుంది. దీన్ని క్రీస్తు శకం 106వ సంవత్సరంలో నిర్మించారని చెబుతారు. కానీ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే ఈ కట్టడం ఉందని కొందరు అంటారు.
Advertisements
Advertisements
ది లోన్లీ క్యాజిల్‌ను చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు అక్కడికి తరచూ వెళ్తుంటారు కూడా. ఇది అద్భుతమైన శిల్ప కళాకృతులను కలిగి ఉంటుంది. అందువల్ల పర్యాటకులు ఎంత సేపైనా ఈ నిర్మాణాన్ని అలా చూస్తూ గడిపేస్తారు. ఇక ఇలాంటిదే మరొక నిర్మాణం పెట్రాలోని జోర్డాన్‌లో ఉంది.