Advertisement
భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన పౌరుడైనా సరే ఎక్కడికైనా వెళ్లవచ్చు. భారతీయులందరికీ దేశంలో ఎక్కడైనా ఉండేందుకు హక్కు ఉంది. అయితే ఆ ప్రదేశంలోకి మాత్రం మనకు ప్రవేశం లేదు. నిజానికి ఆ ప్రాంతం కూడా భారతదేశంలోనే ఉంది. కానీ అక్కడికి ఇతర భారతీయులే కాదు, అసలు ఎవరికీ ప్రవేశం లేదు. అవును.. నిజమే.. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే..
హిమాచల్ ప్రదేశ్ లో మలానా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోకి ఇతరులెవరికీ ప్రవేశం లేదు. ఇతరుల్ని వీరు తమ గ్రామంలోకి అనుమతించరు. వారు భారతీయులే అయినా సరే.. కనీసం పొరుగు ప్రాంత వాసులే అయినా సరే.. ఎవర్నీ ఈ గ్రామస్థులు తమ గ్రామంలోకి అనుమతించరు. ఈ గ్రామాన్ని వారు పవిత్రమైందిగా భావిస్తారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న భారీ రాళ్లను కూడా ఇతరులెవరూ తాకడానికి వీలు లేదు. వాటిని వారు పవిత్రమైనవిగా భావిస్తారు.
ఇక మలానా గ్రామ సరిహద్దులోనూ ఆ గ్రామ వాసులు ఇతరులెవరినీ ఉండనివ్వరు. అందువల్ల ఆ గ్రామవాసులతో ఇతరులెవరూ కలవరు. వారిని కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వమని ఎవరూ అడగరు. ఇతరులను వారు శత్రువుల్లా చూస్తారు. అందుకని ఆ గ్రామం ఉన్న ప్రాంతంలోని కొండల వద్దకు వచ్చే పర్యాటకులు ఆ గ్రామం సమీపం నుంచి కూడా వెళ్లరు. చుట్టూ తిరిగి వేరే మార్గం ద్వారా వెళ్తుంటారు. ఎవరైనా ఆ గ్రామంలోకి ప్రవేశిస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలియదు కానీ.. అందులోకి మాత్రం వారు ఇతరులెవరినీ అనుమతించరు.
Advertisements
Advertisement
కాగా క్రీస్తుపూర్వం 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గాయపడిన కొందరు సైనికులను అక్కడే వదిలి వెళ్లాడట. దీంతో ఆ సైనికులు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారట. ఇక ఇప్పుడు ఉన్న మలానా గ్రామస్థులు వారి పూర్వీకులేనని చెబుతారు. అలా వారు ఈ ప్రాంతంలో అప్పటి నుంచి స్థిరపడ్డారు. ఇతరులతో కలిసి తిరిగినా, వారితో మాట్లాడినా, వారిని తమ గ్రామంలోకి అనుమతించినా తమ గ్రామం, తమ జాతి కలుషితం అవుతుందని మలానా గ్రామస్థులు భావిస్తారు. అందుకనే ఇతరులెవరికీ ఇక్కడికి ప్రవేశం లేదు.
Advertisements
ఇక వీరికి మలానా హైడ్రో పవర్ స్టేషన్ అందుబాటులో ఉంది. అందువల్ల విద్యుత్ సమస్య లేదు. అలాగే బయటి ప్రపంచానికి వీరు దూరంగా ఉంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తారు. తమ పనులను తామే చక్కబెట్టుకుంటారు. సొంతంగా స్కూళ్లు ఉన్నాయి. తమదైన సొంత విద్యావ్యవస్థను వీరు అనురిస్తారు. ఇలా వీరు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తమకు తామే సొంతంగా జీవిస్తున్నారు.