Advertisement
ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి. లక్ష్యం ఉంటేనే దాని వైపు ఎవరైనా ప్రయాణం చేయగలుగుతారు. లక్ష్యసాధన దిశగా అంకిత భావంతో కృషి చేస్తే.. విజయం తప్పక వరిస్తుంది. సరిగ్గా ఈ విషయాలను నమ్మాడు కనుకనే అతను.. ఎంతో శ్రమకోర్చి ఒకప్పుడు కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నాడు. తరువాత ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అనంతరం ఐపీఎస్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు.
[]’;
రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన రవి మోహన్ సైనీ విశాఖపట్నం నేవీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తన తండ్రి నేవీ అధికారి కనుక ఆ స్కూల్‌లో అతను విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 10వ తరగతిలో ఉండగానే.. 2001లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)షోలో 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఆ తరువాత జైపూర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక తన తండ్రి నేవీ అధికారి కావడంతో తాను పోలీస్ అయ్యి దేశానికి సేవ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంబీబీఎస్ పూర్తవుతున్న తరుణంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. “కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలవడం తనలోని కాన్ఫిడెంట్ ను పెంచింద”టాడు రవి.
Advertisement
ఐపీఎస్ ట్రెయినింగ్ పూర్తయిన అనంతరం రవి మోహన్ సైనీ 2014 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్‌గా విధులు నిర్వహించాడు. రాజ్‌కోట్ సిటీ పోలీస్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాడు. తాజాగా పోరుబందర్ జిల్లా ఎస్పీగా ప్రమోషన్ పొందాడు. ఈ సందర్బంగా డాక్టర్ రవి మోహన్ సైనీ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి నేవీ అధికారి కావడం వల్ల ఆయనను ప్రేరణగా తీసుకుని ఐపీఎస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నానని, అందుకనే ఐపీఎస్ అయ్యానని, ఇప్పుడు జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించానని తెలిపాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తానని అంటున్నాడు. అలాగే జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతానని తెలిపాడు.
Watch Ravi KBC Show :
Advertisements
Advertisements