Advertisement
నేనుండేది ముంబైలో.. ఆఫీస్ నవీ ముంబైలో.. రోజు ఇంటి నుండి నవీ ముంబైలోని సెక్టార్ 5 వరకు బస్ లో వెళ్లి అక్కడ నుండి షేరింగ్ ఆటో లో ఆఫీస్ కి వెళ్తాను.. ఆ రోజు కూడా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను.. అప్పుడే పిలుపు వినిపించింది..రండి ,ఆటో ఎక్కండి అంటూ రోడ్డుపై నిల్చున్న ప్రయాణికులను పిలుస్తున్న పిలుపు..నా దృష్టి అటు మల్లింది..
ఆటోడ్రైవర్ స్థానంలో ఉన్న మహిళను చూసి అక్కడే ఉన్న కాలేజ్ గ్యాంగ్ వెక్కిరిస్తున్నారు..ఆ మాటల్ని విన్నా కూడా ఆమె పట్టించుకోనట్టుగానే ఉంది..ఆమె పిలుపుకి నేను వెళ్లి ఆటో ఎక్కి కూర్చున్నాను..నా ప్రయాణం స్టార్టయింది..రోజు వెళ్లే దారే అయినా ఆ రోజు నాకెందుకో కొత్తగా ఉంది.. నాకు తనతో మాట్లాడాలనిపించింది..
ఆటో నా ఆఫీస్ కి వెళ్లే దారివైపు వెళ్తోంది…
Advertisement
- నేను : ఎప్పటి నుండి ఆటో నడుపుతున్నారు? అంటూ తనతో మాట కలిపా..
- తను : రెండు సంవత్సరాల నుండి..
- నేను : మిమల్ని చూస్తుంటే మీకు చాలా ధైర్యం ఎక్కువ అనిపిస్తుందా..మిమ్మల్ని చూసి ఎవరేం అనుకున్నా,ఎగతాళి చేసినా ఏం పట్టించుకోరు…(నాకు తెలియకుండానే నా నోటి నుండి ఆ మాట వచ్చింది.)
- తను : ఎగతాళి చేసేవాళ్లందరూ నా ఇంటికి వచ్చి నాకు వండిపెట్టరు.నా కుటుంబానికి ఏం చేయరు..నా కుటుంబ బాధ్యత నాపైన ఉంది..వీళ్లందరి మాటలు పట్టించుకుని నేను ఇంట్లోనే కూర్చుంటే నా పిల్లలు పస్తులు పడుకోవాల్సి వస్తుంది. నా కుటుంబంకోసం నేను సంపాదించాలి..వీళ్ల మాటలు నేనెందుకు పట్టించుకోవాలి..ఆమె చెప్తుంది..ఇంతలో మా ఆఫీస్ వచ్చింది..ఆటో దిగి ఆమెకి డబ్బులిచ్చి ఆఫీస్ వైపుకి నడిచాను..
Advertisements
నిజానికి, మన చుట్టుపక్కల వాళ్లేమనుకుంటారో? సమాజం ఏమనుకుంటుందో? అని చాలా మంది భయపడుతూ ఉంటారు..తాము చేయాలనుకున్న పనుల నుండి వెనక్కి తగ్గుతూ ఉంటారు..ఈ రోజు ఆమెని చూసిన తర్వాత నాకెందుకో మనుషుల్లో మార్పు వస్తుంది అనిపిస్తుంది..అందరిలానే తను అనుకోకుండా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది.. ఆ రోజు తన మాటలతో అప్పటివరకు చుట్టుపక్కల వారి మాటలకు బాధపడే నాలో కూడా చాలా మార్పొచ్చింది..
నేను వెళ్లే దారిలో నాకు ప్రతిరోజూ చాలా మంది కనపడుతుంటారు..కానీ ఆఫీస్ హడావిడిలో ,మొబైల్ లో మునిగిపోయి నా చుట్టూ ఉన్నవారిని పెద్దగా పట్టించుకోను..కానీ ఆ రోజు తనని చూసాకా,తనతో మాట్లాడాక నాకెందుకో కొత్తగా అనిపించింది..తనే మళ్లీ ఒకరోజు కనపడింది..ఈ సారి తనని అడిగి ఫోటో తీసా…తన కళ్లల్లో ఆత్మవిశ్వాసం,తన ముఖంలో చిరునవ్వు మీకు పరిచయం చేద్దామని.
Advertisements