Advertisement
బిగ్ బాస్ 12 ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే హౌస్ లో హారిక బాయ్ ఫ్రెండ్ హంట్ మొదలుపెట్టింది.ఇక అభిజిత్‌ను పక్కనపెట్టుకుని హారిక సుజాతను ‘నీకు వేరే ఆప్షన్ లేదు.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లలోనే ఒక బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కోవాలి? లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపము అంటే నువ్వు ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటావు?అని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది.దానికి ఇది చాలా క్రిటికల్ క్వచ్ఛన్ అంటూ నిధానంగా అక్కడి నుండి సుజాత జంప్ అయ్యి నోయల్ దగ్గర ల్యాండ్ అయ్యింది.మన మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు అని కన్నీరుమున్నీరైంది.దీనికి నోయల్ నిన్ను సిస్టర్‌లా చూస్తున్నా.. నీకు కూడా ఆ విషయం తెలుసు వాళ్లను పట్టించుకోకు అని ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక తరువాత రెండో వైల్ కార్డ్ ఎంట్రీ అయిన అవినాష్ పై బిగ్ బాస్ ఓ ప్రోమో వదిలారు. ఇందులో అవినాష్ లైవ్ స్ట్రగుల్స్‌ని పొందుపరిచారు.ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వచ్చిన అవినాష్ అందరితో ఇట్టే కలిసిపోయాడు.కిచెన్ లో డ్యూటీ చేస్తున్న అభిజిత్,అఖిల్ మధ్య చర్చ వాగ్వాదానికి దారి తీసింది.ఈ వ్యవహారం పూర్తయ్యాక అఖిల్ మోనాల్ తో తన బాధను పంచుకున్నాడు.
Advertisement
ఇంట్లో దేత్తడి హారిక, లాస్య, అభిజిత్, సుజాతలు ఓ డిస్కషన్ పెట్టారు.ఈ టైంలో అభిజిత్ సుజాతను చెల్లి అని పిలిచాడు.ఇక దీని పై సుజాత తెగ ఫీల్ అయ్యింది.ఇక బిగ్ బాస్ ఆదేశాలు మేర హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్,కుమార్ సాయి రెండు టీమ్స్ గా మారి స్కిట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.ఇక వీరిద్దరి స్కిట్స్ మధ్య మిగిలిన ఇంటి సభ్యులు యాడ్స్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక గంగవ్వ యోగక్షేమాలు తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూంకి పిలిచారు.దానితో కన్ఫెషన్ రూంకి పాపం వెళ్ళలేక వెళ్ళిన గంగవ్వ తను బిగ్ బాస్ హౌస్ లో రెండు నెలలు ఉండడానికి వచ్చానని కాని పాత నొప్పులు తిరిగి వచ్చాయని.. కళ్లు చాలా బాధ పెడుతున్నాయని బండల్ని పగల కొట్టగల నేను ఇక్కడ ఇమడ లేకపోతున్నా అని గంగవ్వ ఏడ్చేసింది.
ఈ విషయాన్ని చూసిన ప్రేక్షకులంతా కన్నీటిపర్యంతమయ్యారు. గంగవ్వ పాటలు విన్న బిగ్ బాస్ ఆమె మానసిక స్థైర్యం నింపేందుకు, సర్ధి చెప్పేందుకు ఆమెతో చాలాసేపు మాట్లాడి ఆమెను డాక్టర్ రూంకి వెళ్ళమని చెప్పారు.
Advertisements
Advertisements
ఇక డాక్టర్ ను కలవడానికి ఈ వారం కెప్టెన్ అయినా లాస్య గంగవ్వను తీసుకుని మెడికల్ రూంకి వెళ్లడంతో గురువారం నాటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం రేపు కలుద్దాం.