Advertisement
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని భారతప్రభుత్వం 59 యాప్ లను నిషేదించడం జరిగింది. అందులో Tik Tok కూడా ఉంది. Tik Tok బ్యాన్ అయ్యాక…. ఆ కంపెనీ CEO మిస్టర్ మేయర్ …తమ సంస్థలో పనిచేసిన ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఓ లేఖ ను విడుదల చేశారు. ఆ లేఖ యథాతథంగా తెలుగులో…..
“2018 నుండి, భారతదేశంలో 20 కోట్లకు పైగా వినియోగదారులు తమ ఆనందాన్ని మరియు టాలెంట్ ని వ్యక్తపర్చడానికి మా సంస్థ చాలా కష్టపడింది., వినియోగదారుల డేటాని చైనాతో సహా ఏ ఇతర దేశానికి లీక్ చేయలేదు, భారత్ చట్టాల ప్రకారమే వినియోగదారుల డేటా ను గోప్యంగా ఉంచాం , అన్ని సెక్యురిటి నిబంధనలు పాటించామం ., భవిష్యత్ లో కూడా అలాగే ఉంటాం.
Advertisement
“మా ఉద్యోగులే మా బలం” ..సుమారు 2000 మంది ఉద్యోగులు భారత్ లో మా సంస్థ తరపున పనిచేశారు….టిక్ టాక్ బ్యాన్ తో వారి ఉద్యోగావకాశాలు కోల్పోయారు.వారంతా వారి ఉద్యోగాల గురించి ఆందోళన చెందవద్దు ..వారి అవకాశాల్ని పునరుద్దరించడానికి మా శక్తి మేరకు కృషి చేస్తాం….టిక్ టాక్ ఎంతోమందిలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసింది..మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు కూడా మా యాప్ ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు” ……. అంటూ తన లేఖలో తెలియజేశారు ఈ కంపెనీ CEO.
Advertisements
వారి అవకాశాలను పునరుద్దరించడానికి శక్తిమేర కృష్టి చేస్తాం…అనే దాన్ని బట్టి టిక్ టాక్ మీద బ్యాన్ ను తీసేయడానికి WTO ద్వారా ప్రయత్నిస్తారా? లేక టిక్ టాక్ ను పోలిన మరో కొత్త యాప్ తో వస్తారా? లేదా టిక్ టాక్ ను పూర్తిగా ఇండియన్స్ అప్పజెప్పి కొత్త వ్యాపారానికి తెర తీస్తారా? అనేది వేచి చూడాలి.!
Advertisements