Advertisement
అమ్మాయిది వైజాగ్, అబ్బాయిది హైద్రాబాద్….టిక్ టాక్ లో అబ్బాయి వీడియోస్ నచ్చి.. అమ్మాయి హాయ్ అని మెసేజ్ చేసింది.! అబ్బాయి కూడా అమ్మాయికి రిప్లై ఇచ్చాడు. కొద్ది గ్యాప్ లోనే వారి పరిచయాలు ప్రేమగా మారిపోయాయి! ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా…..!
అమ్మాయిది మద్య తరగతి ఫ్యామిలి, ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే… ఈమె పెద్దమ్మాయి! చాలా మెరిట్ స్టూడెంట్ ….అందుకే ఆ అమ్మాయి ఎప్పుడూ కరెక్టే అని అనుకునేవారు.! ఒక రోజు సడెన్ గా ఇంట్లో చెప్పకుండా అబ్బాయితో వెళ్లిపోయింది! మేజర్ కావడంతో మరునాడే ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.!
అమ్మాయి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చివరకు విషయం తెల్సుకొని కుమిలిపోయారు.! ఎప్పుడూ రైట్ అనుకునే అమ్మాయి ఇలా చేయడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు…. రెండో కూతురి భవిష్యత్ గురించి ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.! 20 సంవత్సరాల వయస్సులో తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు…కానీ పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆ అమ్మాయికి తల్లిదండ్రుల మాటలు చెవికెక్కలేదు! పై పెచ్చు…కూతురి నోటి నుండి వినకూడని మాటలు కూడా విని వెక్కి వెక్కి ఏడుస్తూ వెనక్కొచ్చేశారు! తను సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటూ……!
Advertisement
నాలుగు నెలల గడిచాయి…. ప్రేమ పాతదైంది…. నూతన దంపతుల మద్య గొడవలు మొదలయ్యాయి.! ఆర్థిక సమస్యలతో , అవగాహనా రాహిత్యంతో ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభమైంది… నీతో వచ్చి తప్పు చేశానంటూ అమ్మాయి…నిన్ను నా లైఫ్ లోకి ఆహ్వానించి నేనే పెద్ద తప్పు చేశానంటూ అబ్బాయి…రోజూ ఇదే గొడవ.! ఈ నాలుగు నెలల కాలంలో తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా…లిప్ట్ చేయలేదు తను.!
Advertisements
భర్తతో తను ఉండలేనని ఫిక్స్ అయిన అమ్మాయి…తండ్రికి ఫోన్ కలిపింది…. నాన్నా….. సారీ నాన్నా…నేను ఇక్కడ ఉండలేను…మీకు చెప్పకుండా వచ్చి పెద్ద తప్పుచేశాను….నన్ను తీసుకెళ్లండి…అనింది.. అవతలి నుండి నాన్న ఏడుస్తున్నాడు…… అమ్మకి ఫోన్ ఇవ్వండి నాన్న…. ఇంకెక్కడి అమ్మ….. అనునిత్యం నీ గురించే తలుచుకుంటూ వారం క్రితమే హార్ట్ ఎటాక్ తో చనిపోయింది! నిన్ను గుండెలపై ఆడించింది కదా! అందుకే కాబోలు హార్ట్ ఎటాక్ వచ్చింది ఆ పిచ్చిదానికి.! ఉండమ్మ…నువ్వు హ్యాపీగా మీ ఆయనతో ఉండు….!! అంటూ ఫోన్ కట్ చేశాడు తండ్రి!
Advertisements
ఈ కథలో ప్రేమ పేరుతో జరిగిన తప్పులు.
- ఆన్ లైన్ ప్రేమలను నమ్మి …తనతో వెళ్లిపోవడం కూతురు చేసిన తప్పు!
- కూతురు ఆల్వేజ్ కరెక్ట్ అని నమ్మడం తల్లిదండ్రులు చేసిన తప్పు!
- తమది ప్రేమా? ఎట్రాక్షనా? అని తెలుసుకునే లోపే అవతలి వాళ్లకు సెరెండర్ అయిపోవడం!
- కెరీర్ బిల్డ్ అవ్వకముందే…ప్రేమల పేరుతో వారి లైఫ్ తో పాటు తల్లిదండ్రుల గౌరవాన్ని చివరకు ప్రాణాలను బలి తీసుకోవడం!