Advertisement
వారం రోజులుగా ఎక్కడ చూసినా…..నాది నెక్లెసు గొలుసు అనే పాటకు ఢీ కంటెస్టెంట్ పండు వేసిన డాన్స్ కనిపిస్తుంది! యూట్యూబ్ , ఫేస్ బుక్, వాట్సాప్ …వేదికేదైనా…నాది నెక్లెస్ గొలుసు పాటే మార్మోగుతుంది!
పండు లేడీ గెటప్, డాన్స్ ఒకెత్తైతే…. Who Is దుర్గారావు!? అనే డైలాగ్ దాని తర్వాత పండు చేసిన యాక్టింగ్ మరొకెత్తు.! ఇలా ఈ వీడియో రిలీజైనప్పటి నుండి అసలు ఆ దుర్గారావు ఎవరు ? అని తెలుసుకోవాలనే కూతూహలం జనాల్లో పెరిగింది! టిక్ టాక్ ఫాలోవర్స్ కు ఈ దుర్గారావు పరిచయస్తుడే…. ! టిక్ టాక్ ను ఫాలో అవ్వని వారికి ఈయన గురించి పెద్దగా తెలిసి ఉండదు.
దుర్గారావుది అమలాపురం.! సరదాగా తన భార్యతో కలిసి వీడియోస్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేసేవాడు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో అలాగే కంటిన్యూ చేసి టిక్ టాక్ లో దాదాపు 3 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.! దుర్గారావు వీడియోస్ ఫన్నీగా, క్రియెటివ్ గా ఉంటాయి. ఆయన భార్య కూడా ఈ వీడియోస్ కి మంచి సపోర్ట్ ను ఇస్తుంది. అలా దుర్గారావు చేసిన ఓ వీడియోనే నాది నెక్లెస్ గొలుసు….దాన్నే తీసుకొని పండు ఢీ స్టేజ్ షో మీద కుమ్మేశాడు.!
Advertisement
Advertisements
Watch Video : Durga Rao Video
Watch Video : Pandu Dance in Dhee
Advertisements