Advertisement
తిరుపతిలో తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ మొక్క తప్పక తీరుతుందని ఓ నమ్మకం.! అందుకే చాలా మంది తిరుపతి వెంకన్నకు తలనీలాలు సమర్పిస్తుంటారు….మరి ఇలా వచ్చిన ఆ వెంట్రుకలను TTD ఏం చేస్తుంది? దానిపై ఎంత ఆదాయాన్ని పొందుతుంది అనే విషయాలను తెలుసుకుందాం!
2018 లెక్కల ప్రకారం.
5600 కేజీల తల వెంట్రుకలపై TTD కు 7 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.! భక్తులు సమర్పించిన తల వెంట్రుకల పొడవును బట్టి 3 కేటగిరీలుగా విభజిస్తారు.
గ్రేడ్-1
31 ఇంచుల కంటే ఎక్కువ పొడవుంటే వాటిని గ్రేడ్ 1 కింద లెక్కేస్తారు. 1600 కేజీల గ్రేడ్ 1 తల వెంట్రుకలను వేలం వేస్తే దాదాపు 3.56 కోట్ల రూపాయలొచ్చాయి.
గ్రేడ్-2
16-30 ఇంచుల మధ్య పొడవుంటే వెంట్రుకలు గ్రేడ్ 2 కింద లెక్కగడతారు.2000 కేజీల గ్రేడ్ 2 తలవెంట్రుకలపై దాదాపు 3.44 కోట్ల రూపాయలొచ్చాయట!
Advertisement
Advertisements
గ్రేడ్-3
10-15 ఇంచులు పొడవుండే వెంట్రుకలు ఈ కేటగిరిలోకి వస్తాయి…3000 కేజీల గ్రేడ్ 3 వెంట్రుకలపై 24.11లక్షల రూపాయలొచ్చాయట!
ఇక తెల్ల వెంట్రుకలకు కూడా వేలంలో మంచి రేటే పలికింది….1200 కేజీల తెల్ల వెంట్రుకలపై 66.55 లక్షల రూపాయలొచ్చాయట!
Advertisements
వచ్చిన వెంట్రుకలను ఏం చేస్తారు.
భక్తులు సమర్పించిన వెంట్రుకలను …..మొదటగా వేడి నీటిలో బాయిల్డ్ చేస్తారు.! అలా బాయిల్డ్ అయ్యాక…శుభ్రం చేస్తారు. కొన్ని ప్రత్యేక మెషిన్ల సహాయంతో చిక్కులు తీసి…. గోడౌన్లలో నిర్దేశించిన ఉష్టోగ్రతల మద్య ఆరబెడతారు. తర్వాత వీటిని 3 కేటగిరీలుగా మార్చి వేలానికి రెడీ చేస్తారు. ఈ వెంట్రుకలు విగ్గుల కోసం విదేశాలకు ఎగుమతి అవుతాయి.!