Advertisement
హీరో ఇంట్రో సీన్… ప్రతి సినిమాకు అత్యంత కీలకమైన అంశం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ కోసం దర్శకులు ఎంతగా ప్లాన్ చేసుకుంటారో అంతే పక్కాగా ప్లాన్ చేసుకునే సీన్ ఈ హీరో ఇంట్రో సీన్.! ఇక్కడి నుండే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారు. మరీ ముఖ్యంగా మాస్ సినిమాలు ఈ ఇంట్రో సీనే ఆయువు పట్టు…మరి అలాంటి ఇంట్రో సీన్స్….ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోస్ గా ఉన్న వారికి ఏసినిమాల్లో పడ్డాయో చూద్దాం!
1. పవన్ కళ్యాణ్:
జాని, జల్సా , పంజా సినిమాల్లో పవన్ ఇంట్రో సీన్స్ మస్ట్ స్టైలిష్ గా ఉన్నప్పటికీ…. గూస్ బమ్స్ ఇచ్చే ఇంట్రో సీన్ మాత్రం గబ్బర్ సింగ్ మూవీదే….. గుర్రం మీద పోలీస్ డ్రెస్ లో, ముఖానికి ఎర్ర తువ్వాలు, చేతిలో గన్ తో అదిరి పోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో……. సూపర్బ్ గా ఉంటుంది ఈ సీన్ ఫస్ట్ టైమ్ అలాంటి మాస్ లుక్ లో ఓ డిఫరెంట్ మ్యానరిజంతో పవర్ స్టార్ ఇంట్రో ఇస్తుంటే థియేటర్ లు దద్దరిల్లాయి!
2. మహేష్ బాబు:
Advertisements
మహేష్ బాబు కు అర్జున్ , పోకిరి , అతిథి , ఖలేజా సినిమాల్లో సూపర్ ఇంట్రో సీన్స్ ఉన్నాయి . కానీ చాలా సింపుల్ గా , ఒక్క డైలాగ్ కూడా లేకుండా , సింగిల్ ఫైట్ షాట్ లేకుండా హీరోయిజాన్ని స్కై లెవల్లో చూపిన అతడు ఇంట్రడక్షన్ తన బెస్ట్ అని చెప్పొచ్చు . చిన్నతనం నుంచే హీరో అటిట్యూడ్ చూపిస్తూ నెక్స్ట్ షాట్ లో బ్లర్ ఎఫెక్ట్ లో నుండి మహేష్ బాబు ఎంట్రీ దానికి తోడు …. పెను తుఫాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే అనే సాంగ్….. ఈ ఇంట్రోకి థియేటర్లో ఈలలే ఈలలు!
Advertisement
3. ఎన్టీఆర్:
ఆది , సింహాద్రి, అశోక్ , యమదొంగ మూవీస్ లో పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఊసరవెల్లి ఇంట్రడక్షన్ సీన్ ది బెస్ట్ అని చెప్పాలి! విలన్ కు ఓ వ్యక్తి హీరోను గురించిన ఎలివేషన్స్ ఇస్తూంటే మరో వైపు ఆ రూపు సంతరించుకున్న విధానాన్ని చూపుతూ…. చివరకు మనిషి ఆకారంగా తీసుకొచ్చి ఆ మనిషే గోడలు బద్దలు కొట్టుకొని ఎన్టీఆర్ లా నిలబడతాడు . ఈ ఇంట్రో సీన్ కు ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు.
4.ప్రభాస్:
ఛత్రపతి , యోగి మూవీస్ లో విజిల్స్ వేయించే ఇంట్రో సీన్స్ ఉన్నప్పటికీ బాహుబలిలో రథాన్ని లాగుతూ ప్రభాస్ కనిపించే ఇంట్రో సీన్ హైలెట్.!
5. రామ్ చరణ్:
రామ్ చరణ్ కు తన ఫస్ట్ మూవీ లోనే ఇంట్రో సీనే ది బెస్ట్ ఇంట్రోగా మారింది. ఈ సినిమాలో ఖైదీ డ్రస్ లో ముఖానికి మాస్క్ వేసుకొని జైల్లో ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు. రామ్ చరణ్ విలన్స్ తన మొఖానికి ఉన్న మాస్క్ స్లో మోషన్లో లాగుతుంటే గిర్రున గాల్లో తిరుగుతూ మాస్కు తొలిగిపోయి స్టయిలిష్ గా రివీల్ అవుతాడు .
6. అల్లు అర్జున్:
బన్నీ ఇంట్రో దేశముదురులో పీక్స్ లో ఉంటుంది. టాలీవుడ్ హిస్టరీ లో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చేసి అదే సిక్స్ ప్యాక్ తో ఇంట్రడక్షన్ సీన్ లో పవర్ఫుల్ గా కనిపిస్తాడు బన్నీ…..వేణుమాధవ్ ఇచ్చే ఎలివేషన్ కు తగ్గట్టు బన్నీని రివీల్ చేస్తూ…… పూరీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు.
Advertisements