Advertisement
ఉదయం నుండి పని వత్తిడి వలన అలసిన వారు సాయంత్రం ఇంటికి రాగానే పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సేదదీరడం వలన వారి మనసుకు ఎంతో సాంత్వన చేకూరుతుంది అని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజులలో సామాన్యుడి నుండి ప్రముఖుల దాకా దాదాపుగా ప్రతి ఒక్కరూ పిల్లులు, కుక్కలు, కుందేళ్లు ఇలా తమకు ఇష్టమైన జంతువులను పెంచుకోడానికి ఇష్టపడుతున్నారు. కొందరు పక్షులను కూడా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటి బుడి బుడి అడుగులతో, ముద్దు ముద్దు చేష్టలతో పెంపుడు జంతువులు తమనెంతగానో అలరిస్తున్నాయని మురిసిపోతున్నారు వాటి యజమానులు. ఇప్పుడు మనం కొందరు టాలీవుడ్ ప్రముఖుల దగ్గర ఠీవిగా హొయలు పోతున్న కొన్ని పెంపుడు జంతువుల గురించి తెలుసుకుందాం.
ప్రముఖులు-పెంపుడు జంతువులు:
రామ్ చరణ్:
కొన్ని సంవత్సరాల క్రితం బ్రాట్ ను పోగొట్టుకున్న రామ్ చరణ్ కు అతని భార్య ఉపాసన పుట్టిన రోజు కానుకగా జాక్ రస్సెల్ అనే జాతి కుక్కని బహుకరించారు. దాని పేరు కూడా బ్రాట్ అని నామకరణం చేసిన రామ్ చరణ్… తాను పోగొట్టుకున్న బ్రాట్ ను ఈ కుక్క పిల్ల లో చూసుకుంటున్నారు. కుక్క పిల్ల తో పాటు రామ్ చరణ్ వద్ద వంశీ అనే మిత్రుడు బహుకరించిన “కాజల్” అనే నామధేయం గల గుర్రం కూడా ఒకటుంది. అది బహుకరించిన మిత్రుడు చనిపోవడంతో ఆ మిత్రుడిని గుర్రంలో చూసుకుంటున్నారు రామ్ చరణ్. మగధీర, బ్రూస్ లీ వంటి చిత్రాలలో మనం ఆ గుర్రాన్ని చూడవచ్చు.
విజయ్ దేవరకొండ :
విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు స్టార్మ్. సైబీరియన్ హస్కీ (Siberian husky) జాతికి చెందిన ఈ పెట్ తో విజయ్… టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఐతే ఇది వరకు ఎప్పుడూ కుక్కల్ని పెంచుకోడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపని విజయ్ ఈ మధ్య పూరి జగన్నాధ్ ఆఫీసులో వాటితో ఆడుతూ సరదాగా సమయం గడపడం, లాక్ డౌన్ లో కొన్ని కుక్కలకు సంబంధించిన సినిమాలు చూడడంతో తాను కూడా ఒక కుక్కని పెంచుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు విజయ్ పేర్కొన్నారు.
Advertisements
Advertisement
సమంత:
సమంత హాష్ కన్నా ముందు బుగాబో (Bugaboo) అనే కుక్కపిల్లను పెంచుకునేది. అది పార్వో వైరస్ (parvo virus) వలన చనిపోవడంతో ఇప్పుడు హాష్ ని పెంచుకుంటున్నారు.
సుమ కనకాల :
సుమ కనకాల పెంపుడు కుక్క పేరు జొర్రో. ఇది గోల్డెన్ రెట్రీవర్ (Golden retreiver) జాతికి చెందినది. అప్పుడప్పుడు సుమ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కుక్కతో కలిసి వీడియోలు చేసి అందర్నీ నవ్విస్తూ ఉంటుంది.
అనసూయ భరద్వాజ్:
అనసూయ భరద్వాజ్ పెంచుకునే పక్షి పేరు హ్యాపీ భరద్వాజ్, బడ్డీ. మోలుకెన్ కాకెటూ (Moluccan cockatoo) జాతికి చెందిన బర్డ్ ఇది.
వీరంతా తమ పెంపుడు జంతువులను వారి సొంత పిల్లలుగా చూసుకుంటూ పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. మన టాలీవుడ్ ప్రముఖులు పెంచుకునే జంతువుల రేటు వేలల్లో ఉంటుంది. అంత పెట్టి కొనలేని వారి అభిమానులు, సామాన్యులు లోకల్ గా దొరికే వాటినే పెంచుకోవడం, రోడ్ మీద తిండి లేక తిరిగే మూగ జీవాలకు ఆశ్రయం కల్పించడం హర్షణీయం.
అందరిలో అమల ప్రత్యేకం:
ఏదేమైనా టాలీవుడ్ ప్రముఖులలో జంతు ప్రేమికురాలిగా అక్కినేని అమల గారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆదరణకు గురవ్వని జంతువులకు తమ బ్లూ క్రాస్ సంస్థ ద్వారా ఆశ్రయాన్ని, వైద్య సదుపాయాల్ని అందిస్తున్నారు.
Advertisements