Advertisement
హీరోల పిల్లలు హీరోలుగా, హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రి ఇస్తుంటారు..మరి తెరవెనుక ఉండి వీళ్లందరిని గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏంటి..వాళ్లేం చేస్తుంటారు.. ప్రస్తుతం టాలివుడ్లో టాప్ డైరెక్టర్స్ పిల్లల గురించి తెలుసుకుందాం..
రాజమౌళి – కార్తికేయ, మయూఖ
ఎస్ఎస్ రాజమౌళి,రమా దంపతులకు ఇద్దరు పిల్లలు కార్తికేయ,మయూఖ.. రాజమౌళి కుటుంబం మొత్తం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కొడుకు కార్తికేయ తండ్రి వెనుకే సినిమాల్లోకి అడుగుపెట్టగా, కూతురు మయూఖ ప్రస్తుతం చదువుకుంటుంది.బాహుబలి సినిమాలో చిన్నచిన్న పాత్రలో మెరిసిన మయూఖ ఇండస్ట్రీలోకే అడుగుపెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
పూరి జగన్నాధ్ – పవిత్ర,ఆకాశ్
Advertisements
బుజ్జిగాడు సినిమాలో తన ఇద్దరు పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయ చేశాడు పూరి.. బుజ్జిగాడులో చిన్నప్పటి త్రిష. ప్రభాస్ పాత్రల్ని పోషించింది పూరి పిల్లలు ఆకాశ్, పవిత్రలే..తర్వాత ఆకాశ్ ఇండస్ట్రీలోనే హీరోగా సెటిల్ అయ్యాడు..ఎంతో మంది హీరోలకి హిట్స్ ఇచ్చిన పూరి తన కొడుకుని స్టార్ హీరోగా చూస్కోవాలనుకుంటున్నాడు..మరి కూతురు పవిత్ర సంగతో.. తన కూడా ఇండస్ట్రీలోనె స్థిరపడాలనుకుంటుంది..కాకపోతే తెరమీద కాదు..తండ్రిలానే తెరవెనుక ఉండి సినిమాను నడిపించాలనుకుంటుంది.డైరెక్టర్ కావడానికి ఆ దిశగా అడుగులు వేస్తుంది పవిత్ర.
సుకుమార్ – సుకృతి వేణి,సుక్రాంత్
సుకుమార్,తబిత దంపతులకు ఇద్దరు పిల్లలు సుక్రాంత్, సుకృతి .. ఇద్దరూ చిన్నపిల్లలే అయితేనేం సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది సుకృతి..తండ్రి బర్త్ డే సంధర్బంగా ఒక పాట పాడి రిలీజ్ చేసింది.. Urban jam with Sukruthi పేరిట యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.
తేజ – అమితోవ్, ఆరవ్, ఐలా
Advertisement
దర్శకుడు తేజకు ముగ్గురు పిల్లలు కాగా వారిలో చిన్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు.. పెద్ద కొడుకు అమితోవ్ నాలుగేళ్ల వయసులో చిత్రం సినిమాలో నటించాడు.. ప్రస్తుతం తన కొడుకుని హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నాడు..కూతురు ఐలా అమెరికాలో మాస్టర్స్ చేస్తుంది..అక్కడి యూనివర్శిటి తరపున ఫోరమ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ మంచి స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకుంది..ఫ్యూచర్లో బిజినెస్ ఉమన్ గా ఎదుగాలన్నది తన కల.
గుణ శేఖర్ – నీలిమ
దర్శకుడు గుణశేఖర్ కు ఇద్దరు కూతుర్లు నీలిమ, యుక్త.. పెద్ద కూతురు నీలిమ రుద్రమదేవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా,చిన్నకూతురు యుక్త సినిమా మేకింగ్ లో శిక్షణ తీసుకుంటుంది..
వంశి పైడిపల్లి – ఆద్య
వంశీ పైడిపల్లికి ఒక కూతురు.. పేరు ఆద్య.. మహేష్ బాబు కూతురు సితార , ఆద్య మంచి ఫ్రెండ్స్..ఇద్దరు కలిసి ఒక యూట్యుబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు..చిన్న ఏజ్ లోనే ఇద్దరు టాలెంటెడ్ స్పీకర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు..ఛానెల్ నేమ్ A&S అంటే ఆధ్య అండ్ సితార..వాళ్ల ఛానెల్లో ఏకంగా మహేశ్ ని ఇంటర్వ్యూ చేశారు ఈ ఇద్దరు గడుగ్గాయిలు.
మారుతి – అభిష్టా,ఆశ్రీశ్
ప్రతిరోజు పండగే సినిమాతో ప్రేక్షకులకు తన కూతురిని పరిచయం చేశాడు మారుతి..మారుతి పెద్ద కూతురు అభిష్టా ఈ సినిమాలో తన కూతురితో ఒక పాత్ర చేయించాడు.. ఓ బావా మా అక్కను సక్కగ చూస్తావా అంటూ రాశి కన్నాని ఆటపట్టించే చెల్లెల్లో అభిష్టా ఒకరు..మొదటి సినిమాకే భారిగా రెమ్యునరేషన్ తీసుకున్న అభిష్టా ప్యూచర్లో సినిమాల్లోనే సెటిల్ అవ్వాలనుకుంటుందట.
Advertisements