Advertisement
బాహుబలి సినిమా ఎఫెక్ట్ తో మన తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.అందుకే ఈమధ్య రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలన్నీ మినిమం 100 కోట్ల పైన బిజినెస్ చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మన తెలుగు హీరో, హీరోయిన్లు అమాంతం తమ రెమ్యునరేషన్స్ పెంచేశారు. బిజినెస్ బాగా జరుగుతుండటంతో దీనికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ఇలా అంతా సరిగ్గా జరుగుతుందని అందరూ ఆనందపడేలోపే కరోనా వచ్చి అందరి కొంప ముంచింది.కరోనా పూర్తయ్యాక మళ్లీ సినిమా షూటింగ్ లు ప్రారంభించాలని ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యింది.ఈలోపు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకునే టాప్ హీరోలు ఎవరో చూద్దాం.
ప్రభాస్ :
బాహుబలి పార్ట్ 1,2 లో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రం చేయనున్నారు.ఈ చిత్రానికి ఆయన 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
మహేష్ బాబు :
Advertisements
అందరికీ వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది కాని మన సూపర్ స్టార్ కి వయసు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది.ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని పాపం సూపర్ స్టార్ ని ఆయన సహనటులు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారట.మరి అలాంటి మహేష్ గారు ప్రస్తుతం ఓ చిత్రానికి సుమారు 40 నుండి 80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ :
Advertisement
చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం
అల్లు అర్జున్ :
ఈ ఇయర్ మొదట్లో అలా వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న స్టైలిష్ స్టార్ ప్రస్తుతం తాను చేస్తున్న ‘ పుష్ప’ చిత్రానికి 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ :
ఇండస్ట్రీలో ఏకసంతాగ్రహిగా,కంప్లీట్ యాక్టర్ గా పేరున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రానికి ఎన్టీఆర్ 33 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారని సమాచారం
రామ్ చరణ్ :
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్. రంగస్థలం తో క్రిటిక్స్ నుండి మెప్పును పొందారు.ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఈయన 33 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారని సమాచారం.
Advertisements