Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

టాలీవుడ్ హీరోయిన్స్….సినిమాకు ఎంత తీసుకుంటారు? 3 కోట్ల‌తో అనుష్క టాప్ మ‌రి నెక్ట్స్?

Advertisement

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అంటే హీరోల పక్కన ఏదో డ్యాన్సింగ్ డాల్స్ లా చూస్తుంటారు.. కానీ తమ నటనతో , టాలెంట్ తో  ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు..మరి వీళ్లకి ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో? వారి నటనకు తగ్గట్టుగా వారి వారి పారితోషికాల రేట్లను పెంచేస్తుంటారు మన హీరోయిన్లు..ప్రస్తుతం టాలివుడ్లో గా నటనలోనూ, అవకాశాల్లోనూ, పారితోషికంలోనూ దూసుకుపోతున్న టాప్  హీరోయిన్లెవరో చూడండి..

అనుష్క – 3 కోట్లు:

టాలివుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణుల్లో మొదటి పేరు అనుష్కదే.. అనుష్క ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ 3 కోట్ల రూ. సూపర్ సినిమాతో టాలివుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క..అతి తక్కువ కాలంలోనే టాలివుడ్ రారాణిగా పేరుపొందింది.. హీరోలతో సమానంగా,కొన్ని సంధర్బాల్లో హీరోలకి ధీటుగా నటించగల నటి ఎవరన్నా ఉన్నారా అంటే అనుష్క మాత్రమే..దశాబ్దంపైనే అయినా అనుష్కకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా.. బాహుబలితో వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకుంది

anuska

Advertisements

సమంత – 2 కోట్లు:

పెళ్లి తర్వాత విభిన్న పాత్రల్ని ఎన్నుకోవడంతో పాటు..నటనలో కూడా వైవిధ్యత చూపిస్తుంది సమంత..కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సమంతకి మంచి క్రేజ్ ఉంది..ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన సమంత ఖాతాలో రంగస్థలం, ఓ బేబి, సూపర్ డీలక్స్ ,మజిలి లాంటి డిఫరెంట్ మూవీస్ ఎన్నో ఉన్నాయి.ఒక సినిమాకి సమంత తీసుకునే పారితోషికం రూ.2కోట్లు.

samantha

కాజల్ – 1.2 కోట్లు:

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.. కాజల్ తీసుకునే రెమ్యురేషన్ రూ.1.2 కోట్లు.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలివుడ్ కి పరిచయం అయిన కాజల్..ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం గడిచింది. అయినప్పటికి కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలబడుతూ టాలివుడ్ స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు దక్కించుకుంటుంది..చిరు,చరణ్, పవన్, అల్లు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలి మెంబర్స్ అందరితో నటించింది కాజల్..

kajal

కీర్తి సురేష్ -1.5 కోట్లు:

మహానటి సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.. దాంతో పాటు రెమ్యునరేషన్ కూడా ..కీర్తి ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 1.5 కోట్లు.. మహానటి తర్వాత అంతటి గుర్తింపు లభించే పాత్రలు రాకపోయినప్పటికి కీర్తి కెరీర్లో మహానటి ఒక మైలురాయి.. తర్వాత వరుస అవకాశాలను చేజిక్కించుకుంది.

keerthi suresh

రకుల్ ప్రీత్ సింగ్ – 1 కోటి:

Advertisement

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సందీప్ సరసన నటించిన రకుల్.. అనతి కాలంలోనే చెర్రీ, అల్లు అర్జున్ సరసన ఛాన్స్ లు కొట్టేసి స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.. రకుల్ ఒక సినిమాకి అందుకునే రెమ్యునరేషన్ కోటి రూపాయలు..రకుల్ స్పీడ్ కొంచెం తగ్గింది.

rakul preet sing

మెహ్రీన్ – 80 లక్షలు..

మెహ్రీన్ ఫిర్జాదా.. ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారి కొన్ని అవకాశాలు పోగొట్టుకుంది.. కానీ వెంటనే అలర్ట్ అయి ఫిట్నెస్ పై కాన్సన్ట్రేట్ చేసి అవకాశాలు దక్కించుకుంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, క్రిష్ణగాడి వీర ప్రేమ గాధలాంటి హిట్ మూవీస్ లో నటించి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.. మరి తను తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే 80లక్షలు.. ఇకపై దాన్ని తొంబై లక్షలు, కోటికి పెంచాలనుకుంటుందట.

mehrin

శృతిహాస‌న్- 1 కోటి.

క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి కెరీర్….గ‌బ్బ‌ర్ సింగ్ తో పీక్స్ లోకి వెళ్లింది. త‌ర్వాత వ‌రుస‌గా బ‌లుపు, ఎవ‌డు, రేసుగుర్రం, శ్రీమంతుడు సినిమాల‌తో సౌత్ లో వ‌న్ ఆఫ్ ది టాప్ యాక్ట‌ర్ గా నిలిచింది!

sruthi hasan

నయనతార- 1 కోటి.

మ‌ళ‌యాలం లో త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన న‌య‌న‌తారు…ఒకానొక ద‌శ‌లో 3 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. త‌ర్వాత త‌న ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న న‌య‌న్ త‌ర్వాత‌…త‌న రేటును 1 కోటికి త‌గ్గించుకుంది.  దుబాయ్ శ్రీను, తుల‌సి ,బిల్లా, అదుర్స్, సింహా సినిమాల్లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది న‌య‌న్!

nayana tara

త్రిష – 1 కోటి.

సైడ్ క్యారెక్ట‌ర్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన త్రిష‌….ఓ ద‌శ‌లో తెలుగు చిత్ర సీమ‌ను ఏలింది. త్రిష ఉంటే ఆ సినిమా స‌క్సెస్ అనే రేంజ్ కు వెళ్లింది. వ‌ర్షం త‌న తొలి తెలుగు సినిమా…ఈ సినిమాకు సౌతిండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను సాధించింది.

trisha

నిత్యా మీనన్- 90 లక్షలు.

బెంగుళూరుకు చెందిన నిత్యా…ఇష్క్, గుండెజారి గ‌ల్లంతయ్యిందే, S/o స‌త్య‌మూర్తి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకుంది.

nityamenon

త‌మ‌న్నా-  90 లక్షలు: 
హ్యాపీ డేస్ తో…. తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైన త‌మ‌న్నా భాటియా…మంచి అవ‌కాశాల‌నే కొట్టేసింది.! మిల్క్ బ్యూటీగా, మంచి డ్యాన్స‌ర్ గా గుర్తింపుపొందింది.

Advertisements